Hyderabad Crime : ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం, ఉద్యోగం ఇస్తానని గదికి పిలిచి అసిస్టెంట్ డైరెక్టర్ పై అత్యాచారం-hyderabad instagram relation man molested woman assistant director in yousufguda ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం, ఉద్యోగం ఇస్తానని గదికి పిలిచి అసిస్టెంట్ డైరెక్టర్ పై అత్యాచారం

Hyderabad Crime : ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం, ఉద్యోగం ఇస్తానని గదికి పిలిచి అసిస్టెంట్ డైరెక్టర్ పై అత్యాచారం

Bandaru Satyaprasad HT Telugu
Sep 29, 2024 10:28 AM IST

Hyderabad Crime : హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగ అవకాశం ఇస్తానని ఇన్ స్టాలో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి గదికి రప్పించి ఆమెపై అత్యాచారం చేశాడో వ్యక్తి. ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం, ఉద్యోగం ఇస్తానని గదికి పిలిచి అసిస్టెంట్ డైరెక్టర్ పై అత్యాచారం
ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం, ఉద్యోగం ఇస్తానని గదికి పిలిచి అసిస్టెంట్ డైరెక్టర్ పై అత్యాచారం

Hyderabad Crime : హైదరాబాద్ లో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం చేసుకుని యువతి గదికి రప్పించి ఆమెపై దారుణానికి పాల్పడ్డాడో వ్యక్తి. ఆ యువతి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ మరోసారి కలకలం రేపింది. ఇటీవల టాలీవుడ్ లో అత్యాచారం ఆరోపణలు ఎక్కువయ్యాయి. యూసఫ్ గూడ పరిధిలోని మధురానగర్ లో ఈ దారుణం జరిగింది. రహమత్ నగర్ కు చెందిన ఓ మహిళ (30)... అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. ఆమె ఈ ఏడాది జూన్ లో తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఇటీవల ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో శశికిరణ్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

శశి కిరణ్ రెడ్డి తనకు మూవీ ఆఫీస్ ఉందని, అందులో పనిచేయాలని యువతికి మాయమాటలు చెప్పాడు. ఈ నెల 27వ తేదీ రాత్రి మధురానగర్ లోని తన గదికి రావాలని శశికరణ్ రెడ్డి కోరడంతో ఆమె అక్కడికి వెళ్లింది. ఆమెను గదిలో బంధించిన శశికరణ్ రెడ్డి అత్యాచారం చేశాడు. ఆ గది నుంచి తప్పించుకున్న యువతి... పై అంతస్తులోని వారికి విషయాన్ని చెప్పడంతో వారు పోలీసులకు ఫోన్ చేశారు. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసు చేశారు.

ఎనిమిదో తరగతి బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం

ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. స్కూల్‌ నుంచి ఇంటికి వస్తున్న బాలికపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేశాడు. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక స్థానికి ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న బాలికను అదే గ్రామానికి చెందిన బొమ్మెన సాగర్‌ అనే ఆటో డ్రైవర్‌ అడ్డగించాడు. బలవంతంగా తన ఇంట్లోకి లాక్కెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. అతడి నుంచి విడిపించుకున్న బాలిక, ఏడుస్తూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.

దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపర్చి శనివారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని ఉరితీయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 2 గంటల పాటు రాస్తారోకో చేయడంతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాలిక బంధువులు, గ్రామస్థులు ఆందోళన విరమించారు.

మరో యూట్యూబర్ పై అత్యాచారం కేసు

యూట్యూబ్ స్టార్, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై అత్యాచార కేసు నమోదు అయ్యింది. మాయమాటలు చెప్పి తనపై లైంగిక దాడి చేశాడని మల్లిక్ తేజ్ పై ఓ యువతి జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని, తరచూ ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం