Congress Manifesto : ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ అమలు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చేందుకు శ్రీధర్ బాబు ప్రతిపాదన!
Congress Manifesto : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో మరిన్ని పథకాలు పెట్టేందుకు సమాలోచనలు చేస్తుంది. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు వివిధ వర్గాలతో వారితో సమావేశం అయి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.
Congress Manifesto : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో... పార్టీలో మేనిఫెస్టోలపై దృష్టిపెట్టాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పనకు కసరత్తు చేస్తుంది. ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ పథకం హామీని మేనిఫెస్టో చేరుస్తున్నామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీ భవన్ లో మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. మేనిఫెస్టోలో తమకు ప్రత్యేక పథకాలు పెట్టాలని పలు వర్గాలు శ్రీధర్ బాబును కోరారు. డోమెస్టిక్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, గిగ్ వర్కర్లు, ట్రాన్స్ జెండర్లు, తెలంగాణ ఉద్యమ కారులు, టూర్స్ అండ్ ట్రావెల్స్ డ్రైవర్స్ యూనియన్స్, తెలంగాణ క్యాబ్ డ్రైవర్ యూనియన్, స్ట్రీడ్ వెండర్స్ , రిటైర్డ్ ఉద్యోగులు ఈ సమావేశం లో పాల్గొని కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెట్టాల్సిన అంశాలపై చర్చించారు.
మరిన్ని పథకాలు
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళా సంఘాలు, వివిధ రంగాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని మేనిఫెస్టోలో మరిన్ని పథకాలు పెట్టేందుకు కసరత్తు చేస్తుంది. సోమవారం ఛైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ వర్గాల వారు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల్లో సేకరించిన అంశాలతో పాటు మేనిఫెస్టో రూమ్ నుంచి వచ్చిన ప్రతిపాదలపై కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ విషయాలను టీపీసీసీతో చర్చించి మేనిఫెస్టోలో చేరుస్తామని శ్రీధర్ బాబు తెలిపారు.
మహిళలకు తులం బంగారం
బీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పేరుతో ఆడపిల్లల పెండ్లికి లక్ష నూట పదహారు రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. దీనికి దీటుగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో కొత్త హామీని ఇవ్వాలనుకుంటుంది. పెళ్లి చేసుకునే యువతికి తులం బంగారాన్ని ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. మహిళా డిక్లరేషన్‌ను త్వరలో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ విడుదల చేయనున్నారు. ఇందులో ఈ హామీని ప్రకటించే చివరకు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీగా పొందుపర్చాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఈ ప్రతిపాదనను మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబుకు తెలిపారు. పెళ్లి చేసుకునే యువతికి ఆర్థిక సాయంతో పాటు పసుపు కుంకుమ కింద తులం బంగారాన్ని ఇస్తే మహిళలకు ఎప్పటికీ ఆస్తిగా ఉండిపోతుందన్నారు. ఈ ప్రతిపాదనకు శ్రీధర్ బాబు కూడా సానుకూలంగా స్పందించారు. మేనిఫెస్టోలోఈ ప్రతిపాదన పొందుపర్చడంతో పాటు సూచనప్రాయంగా ఈ హామీకి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.