Basara Vasantha Panchami: బాసరలో భక్తుల తాకిడి… అక్షరాభ్యాసాల కోసం గంటల కొద్ది పడిగాపులు…
Basara Vasantha Panchami: నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయం భక్తులలో కిటకిటలాడుతోంది, అమ్మవారి జన్మ నక్షత్రం, వసంత పంచమి కావడంతో సుదూర ప్రాంతాల నుంచి చేరుకొని అమ్మవారి దర్శనానికి బారులు తీరారు.
Basara Vasantha Panchami: నిర్మల్ జిల్లాలోని బాసర Basara పుణ్యక్షేత్రంలో ఘనంగా వసంత పంచమి Vasantha panchami వేడుకలు జరుగుతున్నాయి. వేకువ జామునే శ్రీ జ్ఞాన సరస్వతీ Gnana saraswati అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వసంత పంచమిని పురస్కరించుకుని భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూలైన్‌లలో నిలబడి ఉన్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే అక్షర పూజలు మొదలయ్యాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.
బుధవారం వేకువజామున నుండి భక్తులు భక్తిశ్రద్ధలతో గోదావరి Godavari స్నానా ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు, బాసర ఆలయానికి హైదరాబాద్, వరంగల్ మంచిర్యాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
వసంత పంచమి వేడుకలు సందర్భంగా ఆలయ కమిటీవిస్తృత ఏర్పాట్లను చేసింది, సామూహిక అక్షరాభ్యాసం కోసం అదనపు వేది కలను ఏర్పాటు చేశారు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేసుకుంటే చదువుల్లో ముందుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇందుకుగాను ఉమ్మడి అదిలాబాదులోని పలు ప్రాంతాల నుంచి పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు students 100% రిజల్ట్ రావడానికి అమ్మవారికి మొక్కులు తీసుకోవడానికి బారులు తీరారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సరస్వతి అమ్మవారికి ఉదయం 4:30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు, భక్తులకు కొంగుబంగారమై కోరిన కోరికలు నెరవేరుస్తున్నందున అమ్మవారికి భారీగా కానుకలు సమర్పించుకున్నారు.
వసంత పంచమి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఎమ్మెలే పవార్ రామారావు పటేల్ బుధవారం దర్శించుకున్నారు. వసంత పంచమి మహోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఆలయ పూజరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆర్చకులు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. ఆయన వెంట మండల బీజేపీ నాయకులు, అధికారులు తదితరులున్నారు.
అమ్మవారి జన్మదినం సందర్భంగా ఆలయంలో 108 కలశాల జలాలతో అభిషేకం చేశారు. పద్మశాలి సంఘం తరఫున అందజేసిన చేనేత పట్టువస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేక సేవలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు.
అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే చదువుల తల్లి కరుణిస్తుందనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువ జామున 3 గంటల నుంచి చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. అక్షరాభ్యాసాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. సగటున ఒక్కొక్కరికి ఆరు గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోంది.భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో ఏర్పాట్లు చేశారు. sa
(రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్)