తెలుగు న్యూస్ / తెలంగాణ /
Tractor accident : సీఎం కేసీఆర్ సభకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
Khammam News: పాలేరులో తలపెట్టిన బీఆర్ఎస్ సభకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రాక్టర్ బోల్తా
Khammam News: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం జీళ్ళ చెరువులో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు తరలివెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రక్కులో జనాన్ని తరలిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి వరి పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కూసుమంచి గైగోల్లపల్లి నుంచి వెళుతున్న ట్రాక్టర్ కూసుమంచి వద్ద శివాలయం రోడ్డులోని నాన్ తండా వద్ద బోల్తా కొట్టింది. హుటాహుటిన అక్కడి స్థానికులు స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.