Hyderabad Metro : రా..రా.. అంటూ మెట్రోలో అమ్మాయి రీల్స్.. అధికారులు పిలిపించినట్టున్నారుగా..!-girl dances for insta reels in hyderabad metro hmr officials to take action ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Girl Dances For Insta Reels In Hyderabad Metro Hmr Officials To Take Action

Hyderabad Metro : రా..రా.. అంటూ మెట్రోలో అమ్మాయి రీల్స్.. అధికారులు పిలిపించినట్టున్నారుగా..!

HT Telugu Desk HT Telugu
Jul 20, 2022 07:25 PM IST

ఇప్పుడు ట్రెండింగ్.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్. మంచి ప్లేస్ చూసుకుని.. ఓ వీడియో చేసి ఫేమస్ అయిపోవాలనుకుంటారు చాలామంది. కొంతమంతి పర్సనల్ గా షేర్ చేసుకుంటారు. ఓ అమ్మాయి కూడా మెట్రోలో ఇన్ స్టా రీల్ చేసింది. చివరకు కేసుల దాకా వచ్చింది విషయం.

మెట్రోలో రీల్స్ చేసిన యువతి
మెట్రోలో రీల్స్ చేసిన యువతి

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం మెట్రో రైలులో ఓ యువతి డ్యాన్స్ చేసింది. రా..రా.. అంటూ పాటకు డ్యాన్స్ చేస్తే.. అది కాస్త వైరల్ గా మారింది. ఈ విషయంపై చాలామంది నెటిజన్లు మండిపడ్డారు. ఇదేంటి పబ్లిక్ ప్లేస్ లో ఇలా చేయడమేంటని ప్రశ్నలు గుప్పించారు. అంతేకాదు.. ఏకంగా.. మెట్రో అధికారులను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మెట్రోలో డ్యాన్స్ చేసినందుకు ఆ యువతిపై కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇది అధికారికంగా తెలియాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

మెట్రో లోపల, స్టేషన్‌లో డ్యాన్స్ చేసిన వీడియో అప్ లోడ్ చేయగానే.. ఆమెకు వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ విషయం వైరల్ అయింది. ఈ విషయంపై చాలా మంది నెగెటివ్ గా రియాక్ట్ అయ్యారు. మరికొంతమంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. దీంతో యువతిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు ప్రకటించారు.

అయితే.. ప్రజా రవాణాలో ఇలాంటి చర్యలను ఎలా అనుమతిస్తారని చాలామంది నెటిజన్లు మెట్రో రైల్ లిమిటెడ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. 'ఇది సరైన పద్ధతేనా..? మీరు మెట్రో రైళ్లలో దీనికి అనుమతి ఇస్తున్నారా? హైదరాబాద్ మెట్రో స్టేషన్లను పిక్నిక్ స్పాట్‌లుగా, డ్యాన్స్ ఫ్లోర్లుగా మార్చారా?.' అని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌ను ట్యాగ్ చేస్తూ ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.

'నేను చైనాలో ఉన్నప్పుడు ఫుట్‌పాత్‌పై వృద్ధులు డ్యాన్స్ చేయడం చూశాను. ఇది చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ హైదరాబాద్‌లో ఆటోలు స్పీకర్‌లో పాటలు ప్లే చేయడం నాకు గుర్తుంది. ట్రాఫిక్ రైడ్‌ను ఆహ్లాదకరంగా మార్చింది. ఇది హాని కలిగించదు. ఎందుకు ప్రజలు చాలా అసహనంగా మాట్లాడుతున్నారు?' అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

మెుత్తానికి మెట్రో రైలులో యువతి రీల్స్ చేయడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంతి ఆమెకు మద్దతుగా ఉంటే.. మరికొంతమంది ఆమెను విమర్శిస్తున్నారు. అయితే యువతికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పబ్లిక్ ప్రదేశాల్లో ఇలా చేయకూడదని చెప్పినట్టున్నారు అధికారులు.

IPL_Entry_Point