KTR Flexis: కూకట్‌పల్లిలో కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు-flexes against minister ktr in kukatpally metro pillars ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Flexis: కూకట్‌పల్లిలో కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

KTR Flexis: కూకట్‌పల్లిలో కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

HT Telugu Desk HT Telugu
Oct 06, 2023 12:48 PM IST

KTR Flexis: కూకట్‌పల్లిలో మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా వెలిసిని ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మెట్రో పిల్లర్లపై మంత్రి కేటీఆర్‌ షేమ్‌ షేమ్‌ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

KTR Flexis: కూకట్ పల్లి‌లో మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. నియోజకవర్గంలో గురువారం బిఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ నేపథ్యంలోనే గుర్తు తెలియని కొందరు వ్యక్తులు సభా ప్రాంగణం పక్కన,ఫ్లైఓవర్ పిల్లర్ల పై మంత్రి కేటీఆర్,కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

yearly horoscope entry point

షేమ్ షేమ్ అంటూ ఫ్లెక్సీలు..

కేటీఆర్ అంటే కోట్ల రూపాయల తినే రాబందు అని, ఎంకేఅర్ అంటే మాధవరం కబ్జా రావు అని గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సిల్లో పేర్కొన్నారు. షేర్ లేనిదే ఏ ప్రాజెక్ట్ సాగదని, ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా..షేమ్ షేమ్ అంటూ ఫ్లెక్సీల్లో రాసుకొచ్చారు.

అభివృధ్ది పేరుతో చెరువులు,ప్రభుత్వ భూములను మయం చేస్తున్నారని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగ హామీ అమలు కు ఇంకెన్ని సంవత్సరాల సమయం పడుతుంది కేటీఆర్ గారు అంటూ ఫ్లెక్సీల్లు అంటించారు. గుర్తు తెలియని వ్యక్తుల పోస్టర్లపై సమాచారం అందుకున్న పోలీసులు ఎటువంటి గొడవలు జరక్కుండా ఫ్లెక్సీలను తొలగించారు.ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారి గురించి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తరుణ్, హైదరాబాద్

Whats_app_banner