పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం-fire accident at pashamylaram industrial area in sangareddy district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం

పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం

HT Telugu Desk HT Telugu
Apr 30, 2022 03:40 PM IST

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫలితంగా పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి.

సంగారెడ్డిజిల్లాలో అగ్నిప్రమాదం
సంగారెడ్డిజిల్లాలో అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని రసాయన, పెయింట్ పరిశ్రమల్లో మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు పక్కన ఉన్న రసాయనలతో కూడిన డ్రములకు అంటుకోవటంతో పరిశ్రమలోని యంత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

సమాచారం అందకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. సంగారెడ్డి, పటాన్‌చెరు, బొల్లారం ప్రాంతాలకు చెందిన ఫైర్ యంత్రాలను కూడా రప్పించారు. మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

IPL_Entry_Point

టాపిక్