Govt Jobs 2024 : హైదరాబాద్ ECHSలో 102 ఉద్యోగాలు - మంచి జీతం, కేవలం ఇంటర్వ్యూనే!
ECHS Hyderabad Recruitment 2024 : హైదరాబాద్ లోని ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 102 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
హైదరాబాద్ లోని(సికింద్రాబాద్) ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ (ECHS) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 102 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. వీటిలో పారా మెడికల్, నాన్ మెడికల్ తో పాటు మెడికల్ కేటగిరి పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 20వ తేదీలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 102 పోస్టుల్లో అత్యధికంగా మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు 24 ఉన్నాయి.
ఆసక్తి గల అభ్యర్థులు https://www.echs.gov.in/job%20vacancies వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. ఇదే వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ వివరాలతో పూర్తి చేసి సికింద్రాబాద్ లో ఉన్న ECHS కేంద్రంలో సమర్పించాలి. దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి... ఇంటర్వూ తేదీలను ఖరారు చేస్తారు. మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. ఇంటర్వూకి ఎంపికైన వారు పూర్తి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో రావాల్సి ఉంటుంది.
పోస్టులను అనుసరించి అర్హతలు ఉన్నాయి. ఎనిమిదో తరగతి నుంచి ఎంబీబీఎస్/ బీడీఎస్/ఎండీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి.ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేస్తున్నారు. ఓఐసీ పాలీక్లినిక్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆపీసర్ పోస్టులకు నెలకు రూ.75000 జీతం చెల్లిస్తారు. మెడికల్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ పోస్టులకు రూ.1,00,000గా ఉంది, టెక్నీషియన్, క్లర్క్, డీఈఓ, ప్యూన్, సఫాయివాలా, చౌకీదార్, అటెండెంట్ పోస్టులకు రూ.16,800 చెల్లిస్తారు.
ఎంపిక ఇలా ఉంటుంది…
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల విద్యార్హతల్లో సాధించిన మార్కులను పరిశీలిస్తారు. వీటిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మెయిల్ ద్వారా ఇంటర్యూల సమాచారం అందిస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు.
ఖాళీల వివరాలు:
- IOC పాలీక్లినిక్: 06
- ల్యాబ్ టెక్నీషియన్: 07
- ల్యాబ్ అసిస్టెంట్: 01
- నర్సింగ్ అసిస్టెంట్: 03
- ఫిజియోథెరపిస్ట్: 03
- మెడికల్ స్పెషలిస్ట్: 03
- ఐటీ నెట్‌వర్క్ టెక్నీషియన్: 01
- ఫిమేల్ అటెండెంట్: 02
- చౌకీదార్: 06
- డ్రైవర్: 05
- సఫాయివాలా: 09
- క్లర్క్: 05
- డీఈఓ: 02
- ప్యూన్: 01
- మెడికల్ ఆఫీసర్: 24
- గైనకాలజిస్ట్: 01
- డెంటల్ ఆపీసర్: 08
- డెంటల్ హైజనిస్ట్: 03
- ఫార్మాసిస్ట్: 12