Mlc Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకే సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల మద్దతు
Mlc Elections: ఉమ్మడి నల్గొండ- ఖమ్మం -వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ మద్దతు ప్రకటించింది.
Mlc Elections: ఉమ్మడి నల్గొండ- ఖమ్మం -వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది.
ఉప ఎన్నికల్లో చింతపండు నవీన్ గారిని బలపరుస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ , ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్ లు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఎస్ ఉద్యోగ,ఉపాధ్యాయ కుటుంబాల పట్టభద్రులు తప్పకుండా సీపీఎస్ రద్దు -పాత పెన్షన్ పునరుద్ధరణ కృషి చేసే మల్లన్న ను మొదటి ప్రాధాన్యత ఓటు తో గెలిపించాలన్నారు.
ఈ సమావేశంలో R&B డిపార్ట్మెంట్ లో చనిపోయిన సీపీఎస్ ఉద్యోగి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ పత్రాలను కుటుంబసభ్యులకు సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ అందించారు.
సీపీఎస్ ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ లో ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వానికి , కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే విధంగా ఫ్యామిలీ పెన్షన్ ను సీపీఎస్ ఉద్యోగుల ఉండేలా ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించారు.
సీపీఎస్ ఉద్యోగి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం సమస్య నే కాక ఎదుర్కొనే ప్రతి సమస్యలు సర్వీస్ సంబంధిత సీపీఎస్ సంఘమే పరిష్కరించాలని తీర్మానించారు.వచ్చే జూన్ మాసం నుండి రెండు నెలల్లో సంఘ సభ్యత్వం పూర్తి చేయాలని తీర్మానించారు.ఈ సమావేశంలో 33 జిల్లాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి లు, కోశాధికారులు, రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు.
హోరాహోరీ పోటీ…
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మే27న జరుగనుంది. ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రధాన పోటీ బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉంది. మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ప్రకటించింది. జూన్ 5న కౌంటింగ్ ఉంటుందని వెల్లడించింది.
పల్లా రాజీనామాతో ఎన్నికలు...
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన... ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
ఫలితంగా మండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కాస్తా ఖాళీ అయ్యింది. 2021 మార్చి 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగగా... ఆ సమయంలో మొత్తంగా 76 మంది వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడగా.. ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న టఫ్ ఫైట్ ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య హోరాహోరీ పోరు నడవగా... చివరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి విజేతగా నిలిచారు. ఆయన ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగాల్సి ఉంది. కానీ తాజా ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి గెలవడంతో ఆయన రాజీనామా అనివార్యమైంది.
బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన రాకేష్ రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ అనూహ్యంగానే దక్కింది. జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రె డ్డికి దగ్గరి వ్యక్తిగా పేరున్న రాకేష్ రెడ్డికి టికెట్ దక్కడం వెనుక పల్లా ఉన్నారని అంటున్నారు. శాసన మండలి పునరుద్దరణ తర్వాత ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరిగితే.. అన్ని సార్లూ బీఆర్ఎస్ విజయం సాధించింది. తొలి రెండు పర్యాయాలు కపిలవాయి దిలీప్ కుమార్, ఆ తర్వాత రెండు సార్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. జనగామ శాసన సభ్యునిగా ఎన్నికైనందున డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
సంబంధిత కథనం