AP TS Weather Update: ఏపీలో మండుతున్న ఎండలు, తెలంగాణలో వర్షాలు… తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం…
AP TS Weather Update: ఏపీలో ఎండలు మండిపోతుంటే, తెలంగాణలో నేడు, రేపు వానలు పలుకరించనున్నాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఐదు రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నాయి.
AP TS Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో గురువారం 11 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు Severe heat Waves,129 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తలు నిర్వహణ శాఖ ప్రకటించింది. శనివారం 13 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు , 79 మండలాల్లో వడగాల్పులు heat waves వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
గురువారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు…
ఏపీలో గురువారం 11మండలాల్లో తీవ్ర వడ గాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.
శ్రీకాకుళం జిల్లాలో 8, మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాలు , విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
శుక్రవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు
శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 129 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో 17 , విజయ నగరంలో 24, పార్వతీపురం మన్యంలో11, అల్లూరి సీతా రామరాజులో 8, విశాఖపట్నంలో 3 మండలాలు, అనకాపల్లిలో 16, కాకినాడలో 9, కోనసీమలో 8, తూర్పుగోదావరిలో 19, పశ్చిమ గోదావరిలో 3, ఏలూరులో 7, ఎన్టీఆర్‌లో 2, గుంటూరులో 1, పల్నాడు జిల్లా అమరావతి మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
మండిన ఎండలు…
బుధవారం తూర్పుగోదావరి జిల్లా గోకవరం, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42°C ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీకాకుళం జిల్లా కొవిలంలో 41.8°C, నంద్యాల జిల్లా గోస్పాడులో 41.7°C, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 41.5°C, పార్వతీపురంమన్యం జిల్లా నవగాంలో 41.3°C, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 41.2°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 19 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు, మిగిలిన చోట్ల 63 మండలాల్లో వడగాల్పులు వీచాయి.
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏపీలో ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని హెచ్చరించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని, డీ హైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
తెలంగాణలో వానలు TS Rains…
మరోవైపు ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు Rains కురుస్తాయని వాతావరణ శాఖ IMD ప్రకటించింది. కొన్ని జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం కూడా వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో అత్యధికంగా 41.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 41.1డిగ్రీలు, వనపర్తి జిల్లా కొత్తకోటలో 41.1డిగ్రీలు, జమయశంకర్ భూపాలపల్లి జిల్లా రోగొండలో 41, ములుగు జిల్లా తాడ్వాయిలో 41, మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో 40.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడిన ఆవర్తన ద్రోణి కారణంగా రెండు రోజులుగా రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారి గా మారిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు మధ్య ఆవర్తన ద్రోణి ఏర్పడిందని, ఈశాన్య రాజస్థాన్ నుంచి మరఠ్వాడా మీదుగా మరొక ఉపరితల ద్రోణి ఏర్పడిందని వివరించారు
ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు తగ్గి చల్లని వాతావరణం నెలకొంది. గత 24 గంటలుగా 20 - 30 కి.మీ వేగంతో గాలులు వీచాయని.. వచ్చే ఐదు రోజులు తెలంగాణలో వాతావరణం ఇలాగే ఉంటుందని ప్రకటించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షసూచన ఉందని తెలిపారు. 12వ తేదీ నుంచి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం