AP Weather Update: ఏపీలో కొనసాగుతున్న వడగాల్పులు, మండుతున్న ఎండలు.. అవసరమైతే బయటకు రావాలని హెచ్చరికలు-ongoing heatwaves in andhra scorching sun in ap warnings to come out if necessary ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Update: ఏపీలో కొనసాగుతున్న వడగాల్పులు, మండుతున్న ఎండలు.. అవసరమైతే బయటకు రావాలని హెచ్చరికలు

AP Weather Update: ఏపీలో కొనసాగుతున్న వడగాల్పులు, మండుతున్న ఎండలు.. అవసరమైతే బయటకు రావాలని హెచ్చరికలు

Sarath chandra.B HT Telugu
Apr 09, 2024 05:10 AM IST

AP Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. నంద్యాలలో సోమవారం 44డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఏపీలో మండుతున్న ఎండలు
ఏపీలో మండుతున్న ఎండలు

AP Weather Update: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మంగళవారం 39 మండలాల్లో వడగాల్పులు Heat Waves, ఎల్లుండి శ్రీకాకుళం జిల్లా హిరామండలంలో తీవ్ర వడగాల్పులు Severe heat waves , 65 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మంగళవారం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం13, విజయనగరం12, పార్వతీపురంమన్యం11, అల్లూరిసీతారామరాజు 3 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

సోమవారం నంద్యాల జిల్లా గోస్పాడులో 44.4°C, వైయస్సార్ జిల్లా వెడురూరులో 44.3°C, కర్నూలు జిల్లా వగరూరులో 43.8°C, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.2°C, అన్నమయ్య జిల్లా సానిపాయలో 43.1°C,

తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.4°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే అన్నమయ్య జిల్లా పెదతిప్పసముద్రం మండలంలో తీవ్ర వడగాల్పులు, మిగిలిన చోట్ల 36 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.

ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

సోమవారం ఏపీలోని 670 మండలాల్లో ఒకే ఒక్క మండలంలో అతి తీవ్రమైన వడగాల్పులు నమోదయ్యాయి. 36 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయి. 633మండలాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం 39మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతవరణ శాఖ అంచనా వేసింది. 631 మండలాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయని, బుధవారం కూడా వడగాల్పుల తీవ్రత తక్కువగానే ఉంటుందని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది. సోమవారం అన్నమయ్య జిల్లాలోని ఒకే ఒక్క మండలంలో తీవ్రమైన వడగాల్పులు నమోదయ్యాయి.

వడగాలులు నమోదైన మండలాల్లో అల్లూరి జిల్లాలో ఒకటి, అన్నమయ్య జిల్లాలో ఐదు, చిత్తూరులో 2, నంద్యాలలో ఒకటి, పార్వతీపురంలో 2, శ్రీకాకుళంలో 8, నెల్లూరులో ఒకటి, సత్యసాయి జిల్లాలో రెండు, తిరుపతిలో 8,విజయనగరంలో 1, పశ్చిమ గోదావరిలో 5మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి. మొత్తం 36 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా పెద్ద తిప్పసముద్రంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. పెద్ద మండ్యంలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

పలు ప్రాంతాలకు వర్ష సూచన…

మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతవరణ కేంద్రం ప్రకటించింది.

ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు గంటకు ౩౦నుండి 40కిలోమీటర్ల వరకు వీచే అవకాశముంది

మంగళ, బుధవారాల్లో…

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఐఎండి అంచనా వేసింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కోన్నారు. ఈదురుగాలులు గంటకు ౩౦నుండి 40కిలోమీటర్ల వరకు వీచే అవకాశముందని, వేడి , తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడవచ్చునని వివరించారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ‌లో వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. రాయలసీమలో సోమ, మంగళవారాల్లో వాతావరణం పొడిగా ఉండనుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం