Bandi Sanjay Comments : కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు, ఈ ఎన్నికల తర్వాత ఏదైనా జరగొచ్చు - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు-bandi sanjay sensational comments on congress govt and kcr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay Comments : కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు, ఈ ఎన్నికల తర్వాత ఏదైనా జరగొచ్చు - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Comments : కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు, ఈ ఎన్నికల తర్వాత ఏదైనా జరగొచ్చు - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Comments : బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని చెప్పారు.

బండి సంజయ్ (ఫైల్ ఫొటో)

Bandi Sanjay Comments: తెలంగాణలో కేసీఆర్ గురించి పట్టించుకునేవారు ఎవరూ లేరన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. అసలు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీనా లేక జాతీయ పార్టీనా అనేది వాళ్లకే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులే లేరని చెప్పారు. గల్లీలో ఎవరు ఉన్నా... ఢిల్లీలో మాత్రం మోదీనే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.

"దేశంలో మళ్లీ వచ్చేది మోదీ సర్కారే. బీజేపీ ఎంపీలు ఎక్కువ గెలిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది. అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండా బీజేపీని గెలిపించుకోవాలి. బీజేపీ గెలిస్తే నిధులు వస్తాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ లేనే లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారు. బేరసారాలు మొదలయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు. కేసీఆర్ కుట్ర వల్లే ఏదైనా జరుగుతుంది. కేసీఆర్ కు చట్టాలంటే గౌరవం ఉండదు" అని బండి సంజయ్ కామెంట్స్ చేశారు.

కాంగ్రెస్ జాగ్రత్తగా ఉండాలి - బండి సంజయ్

"బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే గుడ్డి ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. దీన్ని ప్రజలు ఎవరూ నమ్మటం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా పైన బీజేపీ రావాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను ఇచ్చింది. ఇప్పటి వరకు రైతుబంధు కూడా ఇవ్వలేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ బీజేపీ గెలవాలని కోరుకోవాలి. దేశం కోసం మోదీ ఉండాలి. ఇదే ప్రజల ఆలోచనగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీకి సూచిస్తున్నాను. ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉంటుంది" అంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.