Bandi Sanjay : బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏది అధికారంలోకి వచ్చినా మళ్లీ ఎన్నికలు ఖాయం- బండి సంజయ్-choppadandi news in telugu bjp bandi sanjay says brs congress government collapse in midterm ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bandi Sanjay : బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏది అధికారంలోకి వచ్చినా మళ్లీ ఎన్నికలు ఖాయం- బండి సంజయ్

Bandi Sanjay : బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏది అధికారంలోకి వచ్చినా మళ్లీ ఎన్నికలు ఖాయం- బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Nov 22, 2023 10:20 PM IST

Bandi Sanjay : బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏది అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం అర్థాంతరంగా కూలిపోతుందని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ ఎన్నికలు ఖాయమని జోస్యం చెప్పారు.

బండి సంజయ్
బండి సంజయ్

Bandi Sanjay : ఉద్యోగాలు ఎందుకివ్వడం లేదని నిరుద్యోగులు నిరసన తెలిపితే సముదాయించాల్సింది పోయి తిడతావా యూజ్ లెస్ ఫేలో.. కండకావరమెక్కి మాట్లాడుతున్నావ్ అంటూ కేటీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక్కసారి మడతల చొక్కా.. అరిగిన రబ్బర్ చెప్పులేసుకున్న నీ గతాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధరకు వచ్చిన బండి సంజయ్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ అభ్యర్థి బొడిగె శోభతో కలిసి సంజయ్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ....కేసీఆర్ ప్రతి వేదికపైన ఉద్యోగాలిస్తామని చెబుతుంటే ....కేటీఆర్ కు కండకావరం తలకెక్కి నిరుద్యోగులను చెత్త నాకొడుకుల్లారా.. సన్నాసుల్లారా.. అంటూ బూతులు తిడతావా? యూజ్ లెస్ ఫెలో… ఉద్యోగాల కోసం అల్లాడుతుంటే నిరసన తెలిపితే సముదాయించాల్సింది పోయి తిడతావా అంటు మండిపడ్డారు.

తెలంగాణలో మళ్లీ ఎన్నికలు ఖాయం

సీఎంగా కేసీఆర్ ముఖమే చూడలేకపోతున్నామని, ఇగ కండకావరమెక్కిన కేటీఆర్ ను ఎవడు చూడాలని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఏ పార్టీ అధికారంలో వచ్చినా మధ్యంతర ఎన్నికల తథ్యమని, బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ తన కొడుకును సీఎం చేస్తారన్నారు. అప్పుడు కవిత, హరీశ్ రావు, సంతోష్ రావు ఊరుకోరని తలా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లిపోతే ప్రభుత్వం ఉండదన్నారు. కాంగ్రెస్ లో అందరూ సీఎంలేనని... ఒకరిని సీఎం చేస్తే మిగిలిన వాళ్లంతా ఎమ్మెల్యేలను వెంట బెట్టుకుని పార్టీని వీడతారన్నారు. ఈ రెండు పార్టీల్లో ఏది అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం అర్ధంతరంగా కూలిపోవడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్ పాలనలో సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఫాంహౌజ్ లు కట్టుకున్నారన్నారు.

ఎంఐఎంకు కొమ్ముకాస్తున్నారు

కేసీఆర్ కూడా 100 రూముల ప్రగతి భవన్ కట్టుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. మరి నిలువనీడలేని పేదలకు మాత్రం గూడు ఎందుకు కల్పించలేదని ధ్వజమెత్తారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పటికి ఇవ్వలేదన్నారు. వడగండ్ల వానతో పంట నష్టపోతే ఇదే నియోజకవర్గానికి కేసీఆర్ వచ్చి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కరీంనగర్, చొప్పదండిలో రెండో స్థానం కోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. చొప్పదండిలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేని దద్దమ్మ కేసీఆర్ అని విమర్శించారు. 12 శాతం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంకు కొమ్ముకాస్తున్నాయన్నారు. మరి 80 శాతమున్న హిందువులంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు.

రిపోర్టర్ : గోపికృష్ణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా

Whats_app_banner