Sangareddy Crime: నారాయణఖేడ్‌లో దారుణం.. మద్యం మత్తులో మతిస్థిమితం లేని వృద్ధురాలి పై అత్యాచారం-atrocity in narayankhed an old woman was raped under the influence of alcohol ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Crime: నారాయణఖేడ్‌లో దారుణం.. మద్యం మత్తులో మతిస్థిమితం లేని వృద్ధురాలి పై అత్యాచారం

Sangareddy Crime: నారాయణఖేడ్‌లో దారుణం.. మద్యం మత్తులో మతిస్థిమితం లేని వృద్ధురాలి పై అత్యాచారం

HT Telugu Desk HT Telugu
Aug 29, 2024 07:51 AM IST

Sangareddy Crime: కామం తో కళ్ళు మూసుకుపోయిన ఒక 35 సంవత్సరాల వ్యక్తి, మానసిక వికలాంగురాలైన, ఓ 60 సంవత్సరాల వృద్ధురాలు పై అత్యాచారానికి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ పట్టణంలో జరిగింది. పట్టణంలోని ఒక షాప్ ముందు నిద్రిస్తున్న ఆ మహిళపై అర్ధరాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.

మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

Sangareddy Crime: కామం తో కళ్ళు మూసుకుపోయిన ఒక 35 సంవత్సరాల వ్యక్తి, మానసిక వికలాంగురాలైన 60 సంవత్సరాల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ పట్టణంలో జరిగింది. పట్టణంలోని ఒక షాప్ ముందు నిద్రిస్తున్న, మహిళ దగ్గరికి అర్ధరాత్రి వెళ్లిన ఆ దుండగుడు మద్యసేవించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆ మహిళా ఎంత వారించినా వినకుండా, తన పై అత్యాచారానికి పాల్పడిన సంఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యింది.

అత్యాచారం జరిగినట్టు నిర్దారించిన డాక్టర్లు.…

ఆ మహిళా కాపాడమని అరిచినా అరుపులతో, నిద్రలో ఉన్న చుట్టుపక్కల ఇండ్ల నుండి లేచి జనాలు బయటికి వచ్చారు. విషయం అర్ధం చేసుకున్న తర్వాత, వారు నారాయణఖేడ్ పట్టాన పోలీసులకు ఫోన్ చేయటంతో పోలీసులు ఆ మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సీసీ ఫుటేజ్ చుసిన తర్వాత, తనను పట్టణంలో కూరగాయల వ్యాపారం చేసే ఎండీ మొయిన్ గా గుర్తించిన పోలీసులు, తనను అదుపులోకి తీసుకున్నారు.

తదనంతరం, ఆ మహిళ కు మెడికల్ ఎక్సమినేషన్ చేసి అత్యాచారం జరిగిందని నిర్దారించుకున్నారు. పోలీసులు మొయిన్ అరెస్ట్ చేసి కోర్ట్ ముందర ప్రవేశ పెట్టడంతో, తనను జ్యూడిషల్ రిమాండ్కు తరలించారు. నారాయణఖేడ్ పట్టణంలో ఆడవారి పై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, డిఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన…

ఇంద్రానగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి,షీటీమ్ విధుల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, సైబర్ నేరాలు, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం మహిళల పిల్లల రక్షణకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. అమ్మాయిలను ఎవరైనా అవహేళన చేసిన మరియు ఏ విధమైన ఇబ్బందులకు గురిచేసిన ఒక చిట్టి రాసి బాక్స్ లో వేయాలని సూచించారు. దానికి సీక్రెట్ కి షీ టీమ్ బృందం వద్ద ఉంటుందని వారు వారానికి ఒకసారి వచ్చి కి ఓపెన్ చేసి అందులో ఉన్న ఫిర్యాదులపై తగు చర్యలు తీసుకుంటారని సూచించారు.

చదువుపై శ్రద్ద పెట్టండి..…

చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని మరియు సామాజిక రుగ్మతల గురించి సెల్ఫోన్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిది సెల్ ఫోన్ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది దానికి అలవాటు పడి బానిసలు కావద్దు విద్యార్థి దశ చాలా కీలక కష్టపడే తత్వం కష్టపడి చదువుకోవడం చాలా ముఖ్యమని ఆమె అవగాహనా కల్పించారు.

మహిళలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మరియు అవహేళనగా మాట్లాడిన వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ షీటీమ్ నెంబర్ 8712667434 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సమాచార అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. మరియు నూతన చట్టాల గురించి నూతన చట్టాలలో మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు.

Whats_app_banner