TS AP Rains : అల్పపీడన ద్రోణి ప్రభావం, తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన-ap ts rains alert due depression in west bay of bengal north east monsoon ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Ap Ts Rains Alert Due Depression In West Bay Of Bengal North East Monsoon

TS AP Rains : అల్పపీడన ద్రోణి ప్రభావం, తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

HT Telugu Desk HT Telugu
Nov 07, 2023 10:03 PM IST

TS AP Rains : ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్ష ద్వీప్ ప్రాంతాల నుంచి పశ్చిమ బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీంతో దక్షిణ భారత్ లోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

వర్షాలు
వర్షాలు

TS AP Rains : తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్ష ద్వీప్ ప్రాంతాల నుంచి పశ్చిమ బంగాళాఖాతం మధ్య అల్పపీడనం ద్రోణి కొనసాగుతూ ఉండడంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,కేరళ, తమిళనాడు,కర్ణాటక, రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణలో ఈ జిల్లాలో వర్షాలు

ఈశాన్య రుతపవనాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ( ఐఎండీ) ప్రకటించింది. వచ్చే మూడు రోజులు హైదరాబాద్, మహబూబ్ నగర్, వికారాబాద్,నల్గొండ, నారాయణపేట, ములుగు,వరంగల్, సూర్యాపేట, కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

పగటి పూట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల కంటే ఎక్కువగా

ఇక రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపారు. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు 22 డిగ్రీ సెల్సియస్ గా పడిపోతాయన్నారు.హైదరాబద్ సహా పొరుగు జిల్లాలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. రానున్న మూడు రోజుల్లో స్వల్పంగా పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

వరంగల్ జిల్లాలో భారీ వర్షం- అన్నదాతలకు తీవ్రనష్టం

వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా.. సాయంత్రానికి భారీ వర్షం పడటంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమైంది. కల్లాల్లో ఉన్న ధాన్యం రాసులు తడిసిపోగా.. సరిపడా టార్పాలిన్లు లేక రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ధాన్యం కుప్పలపై పరదాలు కప్పుకోవడానిని అన్నదాతలు అవస్థలు పడాల్సి వచ్చింది. కొన్నిచోట్ల కోతకు వచ్చిన వరి నేలవాలగా, పత్తి పంటకు కూడా నష్టం వాటిల్లింది. వర్షంతో తీవ్ర నష్టంగా నష్టపోవాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

ఏపీకి వర్షసూచన

వాతావరణ శాఖ ఏపీకి వర్షసూచన చెప్పింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం, తమిళనాడులో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతం నుంచి ఏపీ వైపు తూర్పుగాలులు వీస్తున్నాయి. దీంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం... అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

WhatsApp channel