November 02 Telugu News Updates : ఈనెల 11, 12న విశాఖలో మోదీ పర్యటన
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. అప్ డేట్స్ కోసం పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
Wed, 02 Nov 202205:03 PM IST
టీడీపీ హయంలోనే అప్పులు
టీడీపీ ప్రభుత్వంలో హయంలో 40 వేల కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో 11 శాతం వృద్ధి రేటు చూపితే వాస్తవంలో 5.66 గా నమోదు అయ్యిందని చెప్పారు. టీడీపీ హయాంలో రాష్ట్రం అప్పులు 19.55 శాతం మేర పెరిగాయన్నారు. తమ ప్రభుత్వంలో పెరిగింది 15 శాతం అని చెప్పారు.
Wed, 02 Nov 202205:00 PM IST
విశాఖకు ప్రధాని మోదీ
ఈనెల 11, 12వ తేదీల్లో ప్రధాని మోదీ విశాఖలో పర్యటిస్తారు. 10వేల 472కోట్ల రూపాయల విలువైన ఏడు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 12వ తేదీ ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Wed, 02 Nov 202211:06 AM IST
పథకం ప్రకారమే దాడి చేశారు : ఈటల
మునుగోడు నియోజకవర్గంలోని పలివెలలో కిషన్ రెడ్డి ప్రచారాన్ని అడుకుంటే.. పోలీసు వ్యవస్థం ఏం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. పథకం ప్రకారమే.. తన కాన్వాయ్ పై దాడి చేశారన్నారు.
Wed, 02 Nov 202207:20 AM IST
ప్యాకేజ్
IRCTC Tour From Hyderabad: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా ఆగ్రా, ఢిల్లీ, జైపూర్ వెళ్లే వారికోసం కొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. 'GOLDEN TRIANGLE' 'SAI SANNIDHI EX - VIJAYAWADA' పేరుతో టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ గురువారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ నవంబర్ 9వ తేదీన అందుబాటులో ఉంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు.
Wed, 02 Nov 202206:27 AM IST
దారుణం
హైదరాబాద్‌లో అత్యంత విషాద ఘటన వెలుగు చూసింది. బతుకుదెరువు కోసం వచ్చిన ఓ మైనర్ బాలుడి మర్మాంగాలపై కొందరు యువకులు టపాసులు పేల్చారు. అంతేకాదు వీడియో తీసి సోషల్‌మీడియాలో వైరల్ చేశారు.
Wed, 02 Nov 202206:02 AM IST
హైదరాబాద్ కు వెంకట్ రెడ్డి
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. అయితే షోకాజ్ నోటీస్ పై మాత్రం ఆయన ఇంకా స్పందించలేదు.
Wed, 02 Nov 202206:02 AM IST
సూసైడ్ అటెంప్ట్
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం గురునానక్ యూనివర్శిటీ వద్ద బుధవారంనాడు వంశీ అనే విద్యార్ధి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్ననికి పాల్పడ్డాడు .ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Wed, 02 Nov 202204:41 AM IST
జోడో యాత్ర షెడ్యూల్..
హైదరాబాద్‌లో రెండో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలైంది. ఉదయం 6 గంటలకు బోయిన్‌పల్లిలోని గాంధీయాన్ ఐడియాలజీ సెంటర్ నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభించారు. ఇవాళ 27.8 కిలోమీటర్ల మేర నడవనున్నారు. న్యూబోయిన్ పల్లి, బాలానగర్ మెయిన్ రోడ్డు, ఫిరోజ్ గూడ, జింకలవాడ, ముంబై హైవే, మూసాపేట్, కూకట్ పల్లి, హఫీజ్ పేట్ మీదుగా మదీనగూడ వరకు యాత్ర ఉంటుంది. ఉదయం 10 గంటలకు మదీనగూడలోని హోటల్ కినారా గ్రాండ్ వద్ద పాదయాత్రకు విరామం ఇస్తారు. సాయంత్రం 4 గంటలకు BHEL బస్ స్టాండ్ నుంచి మళ్లీ యాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 గంటల సమయంలో ముత్తింగి పాదయాత్రకు విరామం ఇస్తారు. అక్కడే కార్నర్ మీటింగ్ ఉంటుంది. రాత్రికి రుద్రారంలోని గణేష్ మందిర్ సమీపంలో రాహుల్ గాంధీ బస చేస్తారు.
భద్రత పెంపు...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర నేపథ్యంలో నగర పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రెండు రోజుల కిందట షాద్‌నగర్ వద్ద జోడో యాత్రలో చోటు చేసుకున్న ఘటన పునరావృతం కాకుండా పోలీసులు రాహుల్ గాంధీకి మరింత భద్రత పెంచారు. నిఘాను మరింత పెంచారు.
Wed, 02 Nov 202203:43 AM IST
ట్రాఫిక్ ఆంక్షలు
రాహుల్ గాందీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ ట్రాఫిక్ జోన్ ప్రాంతాల్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం ఉదయం 8:00 నుంచి సాయంత్రం 6:00 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. కూకట్‌పల్లి అంబేడ్కర్ వై జంక్షన్ మూసివేసి ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నారు.
Wed, 02 Nov 202201:57 AM IST
వర్షాలు
నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక తీరం, ఉత్తర శ్రీలంక తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో మరోసారి భారీ వర్షాలు(Rains) కురవనున్నాయి. అల్పపీడన ద్రోణి ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈశాన్య గాలులు వీయడంతోపాటు నైరుతి బంగాళాఖాతంలో మరో వాయుగుండంతో రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.=
Wed, 02 Nov 202201:35 AM IST
కొనసాగుతున్న రాహుల్ యాత్ర…
రాహుల్ గాంధీ జోడో యాత్ర హైదరాబాద్ లో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం బోయిన్ పల్లి నుంచి మొదలైంది. ఇవాళ 25 కి.మీలకు పైగా కొనసాగనుంది.
Wed, 02 Nov 202201:24 AM IST
లేఖ
కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ సర్కార్ మరో లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడి కాలువ పనులు కొనసాగిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.
Wed, 02 Nov 202201:22 AM IST
బంగారం వెండి ధరలు…
Gold silver price today 02 November 2022: బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. ఇక మంగళవారం ధరలు తగ్గగా ... ఇవాళ కూడా స్వల్పంగా దిగివచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.60 తగ్గగా... 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 50 దిగివచ్చింది.
ఫలితంగా హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,780గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46, 550 గా ఉంది. ఇక కిలో వెండిపై ఇవాళ రూ.2000 పెరగగా... హైదరాబాద్ లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 65,000గా ఉంది.
Wed, 02 Nov 202201:22 AM IST
రైతులకు ఊరట..
అమరావతి రైతులకు హైకోర్టులో ఊరట దక్కింది. పాదయాత్రను రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని ఏ రకంగానూ దుర్వినియోగం చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.