Hyderabad Crime : భువనగిరిలో హత్య.. కర్ణాటకలో దహనం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య-a wife killed her husband along with her boyfriend in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : భువనగిరిలో హత్య.. కర్ణాటకలో దహనం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

Hyderabad Crime : భువనగిరిలో హత్య.. కర్ణాటకలో దహనం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

Basani Shiva Kumar HT Telugu
Oct 27, 2024 05:21 PM IST

Hyderabad Crime : సాఫీగా సాగిపోతున్న కాపురం. కోట్లాది రూపాయల ఆస్తి. మంచి భర్త. ఇవన్నీ ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు. ప్రియుడు చెప్పిన మాయమాటలు సంతోషాన్ని ఇచ్చాయి. అందుకే దారుణానికి ఒడిగట్టింది. ఆస్తి కోసం ప్రియుడితో కలిసి ఏకంగా భర్తనే చంపేసింది. ఈ దారుణం హైదరాబాద్‌లో జరిగింది.

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య (istockphoto)

హైదరాబాద్‌ నగరానికి చెందిన వ్యాపారవేత్త రమేష్ ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. భువనగిరి సమీపంలో ఆయ్యను హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని కర్నాటకలోని ఓ కాఫీ ఎస్టేట్‌లో తగలబెట్టారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా కామ్‌గా ఉన్నారు. కానీ.. పోలీసులు ఊరుకోలేదు. కేసును సీరియస్‌గా తీసుకొని నిందితులను పట్టుకున్నారు.

వ్యాపారి రమేష్ హత్యకు అతని భార్య నీహారిక, అమె ప్రియుడు డాక్టర్ నిఖిల్ కారణమని పోలీసులు గుర్తించారు. కర్ణాటకలోని కాఫీ తోటల్లో సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన కర్ణాటక పోలీసులు.. దర్యాప్తులో కీలక విషయాలను తెలుసుకున్నారు. వ్యాపారవేత్త రమేష్‌ది హైదరాబాద్. భార్య నిహారికది యాదాద్రి జిల్లా. నిహారిక ప్రియుడు నిఖిల్‌ది కడప జిల్లా అని పోలీసులు చెబుతున్నారు.

హైదరాబాద్ సమీపంలోని భువనగిరి ప్రాంతంలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన నిహారిక.. మృతదేహాన్ని కారులో హైదరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి తరలించింది. హర్యానా రాష్ట్రానికి చెందిన రాణా అనే వ్యక్తి సాయంతో.. ఇద్దరూ కలిసి కాఫీ ఎస్టేట్‌కి తీసుకెళ్లారు. అక్కడ రమేష్ శవాన్ని తగలబెట్టారు. కానీ రమేష్ మృతదేహం పూర్తిగా దహనం కాలేదు.

సగం కాలిన శవాన్ని గుర్తించిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. రూ.8 కోట్ల ఆస్తి కోసమే నీహారిక తన భర్తను చంపినట్లు విచారణలో తేలింది. రమేష్ మృతదేహాన్ని తగలబెట్టేందుకు సహకరించిన రాణాను హర్యానాలోని ఓ దాబా దగ్గర టీ తాగుతుండగా పోలీసులు అరెస్టు చేశారు.

Whats_app_banner