TPCC New Committees : తారాస్థాయికి విభేదాలు.. సీతక్క సహా 12 మంది రాజీనామా
Resignations to TPCC Committees : ఇటీవల పార్టీ అధినాయకత్వం ప్రకటించిన కొత్త కమిటీలు తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పదవులకు కొందరు రాజీనామాలు కూడా చేశారు. మరోవైపు సీనియర్ల కామెంట్స్ నేపథ్యంలో… మరో 12 మంది వారి పదవులకు రాజీనామా చేశారు.
Telangana Pradesh Congress New Committees Issue: తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలు తారాస్థాయికి చేరాయి. కొత్త కమిటీలతో మొదలైనన చిచ్చు... రోజురోజుకూ మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు రాజీనామాల ఇస్తే... మరికొందరు అసంతృప్తి రాగాన్ని వినిపించారు. ఈ నేపథ్యంలో శనివారం భట్టి నివాసంలో భేటీ అయిన సీనియర్లు... కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి టార్గెట్ గా మాట్లాడారు. ఏకంగా సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాన్ని ఇచ్చారు. వలస నేతల నుంచి పార్టీని కాపాడుకునే సమయం వచ్చిందంటూ మాట్లాడారు. ఇదిలా ఉంటే కమిటీల విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వలస నేతలంటూ మాట్లాడిన నేపథ్యంలో... రేవంత్ వర్గంగా భావిస్తున్న పలువురు కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ మేరకు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కు లేఖలు రాశారు.
రాజీనామా చేసిన వారిలో ఎమ్మెల్యే సీతక్క, నరేందర్‌రెడ్డి, విజయరామారావు, చారగొండ వెంకటేశ్, ఎర్ర శేఖర్, పటేల్ రమేష్ రెడ్డి, సత్తు మల్లేశ్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు. వీరంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతలే కావటం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో రేవంత్ వర్గంగా భావించే ా ఆ పార్టీ నేత ఎరవత్రి అనిల్ కూడా ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీనియర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రేవంత్ చేసే పాదయాత్రను దెబ్బ తీయాలని చూస్తున్నారన్న ఆయన.. ముసుగు వీరులు బయటకు వచ్చారంటూ కామెంట్స్ చేశారు. అసమ్మతి నేతల లోపాయికారి ఒప్పందం బీజేపీతోనా బీఆర్ఎస్తోనా..? అని ప్రశ్నించారు. సోషల్ మీడియా పోస్టింగ్ ల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి... సీవీ ఆనంద్ కు ఫోన్ చేయడమేంటని నిలదీశారు. తప్పుడు ప్రచారం చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఉత్తమ్ చెప్పిన మాటలు సరికావని స్పష్టం చేశారు. సీనియర్ నేతలకు ఇవాళ సేవ్ కాంగ్రెస్ నినాదం గుర్తుకువచ్చిందా అని అనిల్ నిలదీశారు. గతంలో 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు.
ఆ నేతల డుమ్మా...
మరోవైపు ఆదివారం గాంధీభవన్ జరుగుతున్న పీసీసీ కార్యవర్గ సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. హాత్ సే హాత్ జోడో యాత్ర పాదయాత్రపై చర్చింనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి సీనియర్ నేతలు.. జానారెడ్డి, మల్లురవి, జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఏఐసీసీ సెక్రెటరీ నదీమ్ జావేద్, షబ్బీర్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, బలరాం నాయక్, మల్లు రవి, పొన్నం ప్రభాకర్, సుదర్శన్ రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు. అనుబంధ సంఘాల ఛైర్మన్ లు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పాత్ర విజయవంతంగా 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా అభినందిస్తూ తీర్మానం చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో యాత్రలను ప్రతి గ్రామాలలో చేపట్టాలని నిర్ణయించారు.