Telangana : అదనంగా 1,200 ఎంబీబీఎస్ సీట్లు.. ఈ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు-1200 additional mbbs seats in telangana know in details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  1200 Additional Mbbs Seats In Telangana Know In Details

Telangana : అదనంగా 1,200 ఎంబీబీఎస్ సీట్లు.. ఈ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు

Anand Sai HT Telugu
Aug 16, 2022 03:54 PM IST

తెలంగాణలో కొత్తగా 1200 ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయి. ఇవన్నీ 2022-23 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి. ఈ దిశగా ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

తెలంగాణలో మరికొన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. రాబోయే నెలల్లో ఔత్సాహికులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ విద్యా సంవత్సరం (2022-23) నుంచి రాష్ట్రంలో అదనంగా 1,200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. త్వరలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఎనిమిదింటిలో జగిత్యాల, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో నాలుగు కొత్త మెడికల్ కాలేజీలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ఎన్‌ఎంసీ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. మహబూబాబాద్, మంచిర్యాల్, కొత్తగూడెం, రామగుండంలో మిగిలిన నాలుగింటికి మరికొన్ని వారాల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది.

ఎనిమిది మెడికల్ కాలేజీల్లో ఒక్కొక్కటి 150 MBBS సీట్లను ఆఫర్ చేయాలని భావిస్తోంది. మొత్తం కొత్త మెడికల్ సీట్ల సంఖ్య 1,200కి చేరుకుంటుంది. ప్రస్తుతం, తెలంగాణలో దాదాపు 1,700 ప్రభుత్వ MBBS సీట్లు అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వం రూ. 1,000 కోట్లకు పైగా ఖర్చుతో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుండి ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించడమే కాకుండా, వచ్చే విద్యా సంవత్సరంలో (2023-24) మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు వేస్తోంది.

గత నెలలో తెలంగాణలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు, అటాచ్డ్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,479 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, జనగాం జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎనిమిది మెడికల్ కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి 800 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెస్తాయి.

IPL_Entry_Point