Year Ender 2022 : ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్ ఎవరో తెలుసా?
Indian Bowlers With Most Wickets : చూస్తుండగానే 2022 సంవత్సరం ముగింపు వచ్చింది. కొత్త సంవత్సరంలో దగ్గరలో ఉన్నాం. ఇక క్రికెట్ ప్రేమికులు ఈ ఏడాది ఆటల్లో ఏం జరిగాయో చర్చలు చేసుకుంటున్నారు. టెస్టు, వన్డే, టీ20.. ఇలా ఏ ఫార్మాట్ లోనైనా.. ఏ టీమిండియా బౌలర్ ఎక్కువ వికెట్లు తీశాడని లెక్కలు వేసుకుంటున్నారు.
2022లో క్రికెట్ అభిమానులకు చేదు, తీపి రెండు అందాయి. ఇక రాబోయేది కొత్త ఏడాది.. నెక్ట్స్ ఏంటని చర్చ నడుస్తూనే.. ఈ ఏడాది క్రికెట్లో ఏం జరిగిందని కూడా మాట్లాడుకుంటున్నారు. మూడు ఫార్మాట్లలో ఎక్కువ వికెట్లు తీసింది ఎవరని చర్చించుకుంటున్నారు. టెస్టు, వన్డే, టీ20(T20)లో టీమిండియా(Team India)లో ఎవరు ఎక్కువ వికెట్లు తీశారని గూగుల్ చేస్తున్నారు.
మూడు రకాల ఫార్మాట్లలో 40కి పైగా వికెట్లు పడగొట్టిన ముగ్గురూ.. అద్భుతమైన భారత బౌలర్లు కావడం విశేషం. మరి ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు ఎవరో చూద్దాం.. బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌తో ఈ ఏడాది టీమ్ ఇండియా షెడ్యూల్ పూర్తయింది. 2022లో మేజర్ సిరీస్‌లు, ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లు ఆడిన టీమ్ ఇండియా ఆటగాళ్లలో చాలామంది మెరిశారు.
భువనేశ్వర్ కుమార్ : టీమిండియా స్వింగ్ బౌలర్ భువనేశ్వర్(bhuvneshwar) ఈ ఏడాది 33 ఇన్నింగ్స్‌ల్లో 37 వికెట్లు పడగొట్టాడు.
మహ్మద్ సిరాజ్ : ఈ ఏడాది టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(mohammed siraj) అద్భుతంగా రాణించాడు. సిరాజ్ 27 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసి మొత్తం 41 వికెట్లు పడగొట్టాడు.
అక్షర్ పటేల్ : టీమిండియా ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్(akshar patel) 2022లో మొత్తం 35 ఇన్నింగ్స్‌లు బౌలింగ్ చేశాడు. ఈసారి ఏకంగా 42 వికెట్లు తీసి మెరిశాడు.
యుజ్వేంద్ర చాహల్ : యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) ఈ ఏడాది టీమ్ ఇండియా తరఫున 32 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసి మొత్తం 44 వికెట్లు పడగొట్టాడు. దీంతో 2022లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్‌గా నిలిచాడు. విశేషమేమిటంటే.. టీ20 ప్రపంచకప్(T20 World Cup) జట్టులో ఉన్న చాహల్ ఈసారి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.