World Cup Qualifiers 2023 : వెస్టిండీస్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. చెలరేగిన సికందర్ రాజా
World Cup Qualifiers 2023, ZIM Vs WI : వెస్టిండీస్‌తో జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో జింబాబ్వే విజయం సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లోనూ రాణించిన జింబాబ్వే 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వెస్టిండీస్ జట్టుకు జింబాబ్వే జట్టు(WI Vs ZIM) షాక్ ఇచ్చింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్(ODI World Cup) క్వాలిఫయర్స్‌లో కరీబియన్‌ను ఓడించి, జింబాబ్వే సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే అద్భుత ప్రదర్శనతో వెస్టిండీస్ జట్టు(West Indies Team) 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జూన్ 26న లీగ్ చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. అమెరికా, నేపాల్‌తో జరిగిన తొలి రెండు గేమ్‌లలో విజయం సాధించిన కరీబియన్ జట్టు జింబాబ్వే చేతిలో ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు మంచి బ్యాటింగ్‌ను ప్రదర్శించింది. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ 47 పరుగులు, సికందర్ రాజా 68 పరుగులు, ర్యాన్ బర్ల్ 50 పరుగులు చేయడంతో జింబాబ్వే 268 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ జట్టుకు మంచి లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టుకు స్వల్ప ఆరంభం లభించినా, ఆ తర్వాత పెద్దగా భాగస్వామ్యం లభించలేదు. ఓపెనర్ కైల్ మేయర్స్ మాత్రమే హాఫ్ సెంచరీతో చెలరేగగా, మిగతా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రోస్టన్ చేజ్ 44 పరుగులు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
జింబాబ్వే తరఫున టెండై చత్రా అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయగా, బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్ లోనూ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు సికిందర్ రాజా(sikandar raza). వెస్టిండీస్ జట్టు 233 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
జింబాబ్వే జట్టు : జాయ్‌లార్డ్ గుంబి, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), వెస్లీ మాధేవేర్, సీన్ విలియమ్స్, సికందర్ రజా, ర్యాన్ బర్ల్, క్లైవ్ మదాండే (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరావ, టెండై చతారా, బ్లెస్సింగ్ ముజ్రాబానీ బెంచింగ్ , ఇన్నోసెంట్ కైయా, ల్యూక్ జోంగ్వే
వెస్టిండీస్ జట్టు : బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, షాయ్ హోప్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), నికోలస్ పూరన్, రోస్టన్ చేజ్, రోవ్‌మన్ పావెల్, జాసన్ హోల్డర్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, అకీల్ హొస్సేన్ బెంచ్: యానిక్ కారియా, కేసీ కార్తీ బ్రూక్స్, రొమారియో షెపర్డ్.