VVS Laxman: ఐర్లాండ్ టూర్ కు టీమ్ ఇండియా కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్...
టీమ్ ఇండియాకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా పనిచేయబోతున్నారు. ఐర్లాండ్ తో జరుగనున్న రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం అతడికి కోచ్ గా బీసీసీ ఐ బాధ్యతల్ని అప్పగించింది.
htరాహుల్ ద్రావిడ్ స్థానంలో టీమ్ ఇండియా కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు. అయితే పర్మినెంట్ గా కాదు. ఐర్లాండ్ తో జరుగబోయే సిరీస్ వరకు మాత్రమే లక్ష్మణ్ కోచ్ గా పనిచేయబోతున్నాడు. జూన్ 26, 28 తేదీలలో ఐర్లాండ్ తో రెండు టీ20 మ్యాచ్ లను టీమ్ ఇండియా ఆడనున్నది. ఐర్లాండ్ లో ఈ సిరీస్ జరుగనున్నది.
అలాగే జూన్ 1 నుంచి ఇంగ్లాండ్ ఏకైక టెస్ట్ మ్యాచ్ ను భారత్ తలపడాల్సి ఉంది. గత ఏడాది కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ టెస్ట్ మ్యాచ్ కోసం సీనియర్లతో కూడిన జట్టుతో ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ముందుగానే ఇంగ్లాండ్ బయలుదేరనున్నారు. ఈ టెస్ట్ కు ముందు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ టీమ్ ఇండియా ఆడనున్నది. వార్మప్ మ్యాచ్ నుంచే ఇంగ్లాండ్ పై గెలుపు కోసం ద్రావిడ్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అందుకే ద్రావిడ్ ముందుగానే ఇంగ్లాండ్ వెళుతుండటంతో అతడి స్థానాన్ని వీవీఎస్ లక్ష్మణ్ తో భర్తీ చేయబోతున్నారు.
ఐర్లాండ్ లో జరిగే రెండు టీ20 మ్యాచ్ లకు మాత్రమే లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరిస్తారు. అతడికి సహాయంగా ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్ లుగా వ్యవహరిస్తున్న సాయిరాజ్ బహుతులే, షితాన్షు కోటక్, మునీష్ బాలిలను ఎంపిక చేశారు. ప్రస్తుతం లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్