Ind vs Zim: డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా వైల్డ్ సెలబ్రేషన్స్.. కాలా చష్మా సాంగ్‌కు డ్యాన్స్
Ind vs Zim: టీమిండియాకు వైల్డ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. జింబాబ్వేపై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ రేంజ్‌లో డ్యాన్స్‌లు చేశారు.
Ind vs Zim: హరారె: టీమిండియా వరుసగా రెండో వన్డే సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేసింది. మొన్న ధావన్ కెప్టెన్సీలో వెస్టిండీస్‌పై.. ఇప్పుడు రాహుల్ కెప్టెన్సీలో జింబాబ్వేపై మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో టీమిండియా ప్లేయర్స్ చాలా వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో బాలీవుడ్ పాపులర్ సాంగ్ కాలా చష్మాకు డ్యాన్స్ చేశారు.
ఈ సెలబ్రేషన్స్‌ను ఓపెనర్ శిఖర్ ధావన్ లీడ్ చేశాడు. మూడో వన్డే సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సిరాజ్, అవేష్ ఖాన్‌లాంటి వాళ్లు రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ధావనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. విజయాన్ని మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అనే క్యాప్షన్‌తో ధావన్ దీనిని షేర్ చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోమవారం జరిగిన చివరి వన్డేలో జింబాబ్వే భయపెట్టినా.. చివరికి 13 రన్స్ తేడాతో గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ పూర్తి చేసింది టీమిండియా. గిల్ వన్డేల్లో తన తొలి సెంచరీ చేశాడు. అతడు కేవలం 97 బాల్స్‌లోనే 130 రన్స్ చేయడంతో టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 రన్స్ చేసింది. ఆ తర్వాత జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రజా కూడా సెంచరీతో చెలరేగి ఇండియన్ టీమ్‌కు చెమటలు పట్టించినా.. 49వ ఓవర్లో అతన్ని ఓ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్ పంపించాడు సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్.
దీంతో 13 రన్స్‌తో గెలిచింది టీమిండియా. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ జింబాబ్వే గడ్డపైనే తొలి విజయాన్ని అందుకోగా.. అతనికి ఇదే తొలి సిరీస్ విజయం అందులోనూ క్లీన్‌స్వీప్ కావడం విశేషం. ఆసియా కప్‌కు ముందు ఈ విజయం రాహుల్ కాన్ఫిడెన్స్‌ను ఇది బూస్ట్ చేసేదే. అయితే బ్యాట్‌తోనే అతడు ఇంకా పూర్తి స్థాయిలో తానేంటో నిరూపించుకోవాల్సి ఉంది.
సంబంధిత కథనం