Team India fined: ఒక్క రూపాయి కూడా రాదు.. టీమిండియాకు భారీ జరిమానా
Team India fined: ఒక్క రూపాయి కూడా రాదు. డబ్ల్యూటీసీ ఫైనల్ టీమిండియా ప్లేయర్స్ ఫ్రీగా ఆడినట్లే. ఐసీసీ మొత్తం 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా విధించడంతో ఈ పరిస్థితి ఎదురైంది.
Team India fined: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన బాధ ఓవైపు వేధిస్తుండగానే టీమిండియాకు భారీ షాక్ ఇచ్చింది ఐసీసీ. ఈ ఫైనల్ ఆడినందుకు టీమిండియా ప్లేయర్స్ కు ఒక్క పైసా కూడా రావడం లేదు. ఎందుకంటే ఐసీసీ మొత్తం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించింది. స్లో ఓవర్ రేటే దీనికి కారణం. అటు ఆస్ట్రేలియా ప్లేయర్స్ కూడా 80 శాతం ఫీజు జరిమానాగా చెల్లించాల్సి వచ్చింది.
అటు ఆస్ట్రేలియా నాలుగు ఓవర్లు తక్కువగా వేయడంతో ఆ ప్లేయర్స్ మ్యాచ్ ఫీజు నుంచి 80 శాతం కోత పెట్టారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.22 ఆర్టికల్ ప్రకారం.. ఒక్కో ఓవర్ కు 20 శాతం మ్యాచ్ ఫీజులో కోత పెడతారు. అటు టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కు అదనంగా మరో 15 శాతం కోత పడింది. ఇండియా రెండో ఇన్నింగ్స్ లో తనను ఔట్ గా ప్రకటించిన తర్వాత గిల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
దీంతో గిల్ ను కూడా ఐసీసీ దోషిగా ప్రకటించి 15 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించింది. అంటే గిల్ ఈ మ్యాచ్ ఆడినందుకు ఒక్క రూపాయి కూడా అందుకోకపోగా.. అదనంగా 15 శాతం చెల్లించాల్సి వస్తోంది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇండియా కాస్త పోరాడినట్లు కనిపించినా.. ఐదో రోజు మాత్రం చేతులెత్తేసింది.
సంబంధిత కథనం