Ganguly on Shubman: శుబ్‌మన్ అదరగొట్టాడు.. భారత బ్యాటర్ల ప్రదర్శనకు ఫిదా అయిన గంగూలీ
Ganguly on Shubman: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అతడు అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడని, అహ్మదాబాద్ టెస్టులో చాలా మెరుగ్గా రాణించాడని అన్నారు.
Ganguly on Shubman: అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్ సెంచరీతో ఆకట్టుకోగా.. విరాట్ కోహ్లీ అర్ధశతకంతో చేసి బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. అయితే శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. నిలకడగా ఆడుతూ అసలైన టెస్టు మజా ఏంటో చూపించాడు. అతడి ఆటపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. శుబ్‌మన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అతడు అద్భుతంగా ఆడాడని అన్నారు.
"బ్యాటింగ్ చేయడానికి ఇది మంచి వికెట్. ఈ అవకాశాన్ని ఇరుపక్షాలు బాగా అందుకున్నాయి. గత మూడు మ్యాచ్‌ల్లో బౌలింగ్ సహకరించే పిచ్‌లపై ఆడి విసిగిపోయారు. ఇది బ్యాటింగ్‌కు మంచి పిచ్. వారు బాగా బ్యాటింగ్ చేశారు. శుబ్‌మన్ గిల్ చాలా మెరుగ్గా ఆడాడు. అతడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు." అని గంగూలీ ప్రశంసించారు. అలాగే టెస్టు క్రికెట్‌తో టీ20 ఫార్మాట్‌ను గంగూలీ పోల్చారు.
"టీ20, టెస్టు క్రికెట్ రెండూ చాలా విభిన్నం. మనం టెస్టు క్రికెట్‌ను సరైన విధానంలో ఉంచాలి. అది చాలా ముఖ్యం. టెస్టుల్లో అశ్విన్ చాలా బాగా రాణిస్తున్నాడు. అతడు క్లాస్ ప్లేయర్. ఫ్లాట్ వికెట్‌పై అతడు నిజంగా అద్భుతంగా ఆడాడు." అని గంగూలీ అన్నారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ గురించి మాట్లాడిన దాదా తను ఫస్ట్ మ్యాచ్ చూశానని, క్వాలిటీ ప్లేయర్లకు ఇది చాలా మంచి టోర్నమెంట్ అని తెలిపారు.
నాలుగో టెస్టులో శుబ్‌మన్ గిల్ 235 బంతుల్లో 128 పరుగులతో ఆకట్టుకోగా.. కోహ్లీ 59 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. అంతేకాకుండా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగుల లక్ష్యాన్ని అధిగమించేందుకు మరో 191 పరుగుల దూరంలో టీమిండియా ఉంది.
సంబంధిత కథనం