Shreyas Iyer on T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయకపోవడం నిరాశ కలిగించింది: శ్రేయస్‌ అయ్యర్‌-shreyas iyer on t20 world cup says he was very disappointed after not making to the team ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Shreyas Iyer On T20 World Cup Says He Was Very Disappointed After Not Making To The Team

Shreyas Iyer on T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయకపోవడం నిరాశ కలిగించింది: శ్రేయస్‌ అయ్యర్‌

Hari Prasad S HT Telugu
Jan 05, 2023 03:25 PM IST

Shreyas Iyer on T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయకపోవడం నిరాశ కలిగించిందని అన్నాడు టీమిండియా ప్లేయర్‌ శ్రేయస్‌ అయ్యర్‌. హిందుస్థాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ఆ నిరాశ నుంచి తానెలా బయటపడిందీ చెప్పుకొచ్చాడు.

శ్రేయస్ అయ్యర్
శ్రేయస్ అయ్యర్ (Getty Images)

Shreyas Iyer on T20 World Cup: ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో నిలకడగా ఆడుతున్న ప్లేయర్‌ శ్రేయస్‌ అయ్యర్‌. గతేడాది అన్ని ఫార్మాట్లలో కలిపి టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా అతడు నిలిచాడు. వన్డే టీమ్‌లో రెగ్యులర్‌గా అతనికి చోటు దక్కుతున్నా.. టీ20ల్లో మాత్రం అవకాశాలు రావడం లేదు. దీంతో గతేడాది టీ20 వరల్డ్‌కప్‌కు కూడా శ్రేయస్‌ దూరమయ్యాడు.

ట్రెండింగ్ వార్తలు

రిజర్వ్‌ ప్లేయర్స్‌కే బీసీసీఐ అతన్ని పరిమితం చేసింది. దీనిపై తాజాగా హిందుస్థాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. వరల్డ్‌కప్‌కు ఎంపిక కాకపోవడం నిరాశ కలిగించిందని అన్నాడు. "చాలా నిరాశగా అనిపించింది. చిన్నప్పటి నుంచీ పెద్ద టోర్నీలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఓ కల. ఆ వరల్డ్‌కప్‌ను టీమ్‌కు అందిస్తే వచ్చే మజానే వేరు" అని శ్రేయస్‌ అన్నాడు.

అయితే ఈ నిరాశ నుంచి తాను త్వరగానే బయటపడినట్లు చెప్పాడు. "వరల్డ్‌కప్‌ ఆడకపోయినా నేను పూర్తిగా డీమోటివేట్‌ కాలేదు. మరీ ఎక్కువగా మనసుపైకి తీసుకోలేదు. నా పని నేను సరిగ్గా చేసుకుంటూ వెళ్లాను. నాపై నేను దృష్టిసారించాను. కాస్త బ్రేక్‌ తీసుకొని, తర్వాత దేశవాళీ క్రికెట్‌ ఆడాను. నా నైపుణ్యాలను పెంచుకోవడానికి అది బాగా పనికొచ్చింది" అని శ్రేయస్‌ చెప్పాడు.

"ఓ ప్లేయర్‌గా టీమ్‌ మేట్స్‌ నుంచి, పేరెంట్స్‌ నుంచి గౌరవం పొందడమే అందరి లక్ష్యం. అదే ప్లేయర్‌గా మనల్ని మోటివేట్‌ చేస్తుంది. నిరాశలో ఉన్నప్పుడు ఇదే మనలోని అత్యుత్తమ ప్లేయర్‌ను బయటకు తీసుకొస్తుంది. నేను ఎప్పుడు నిరాశలో ఉన్నా కుటుంబం, స్నేహితులతో మాట్లాడతా. క్రికెట్‌ నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి చిన్నవిషయాలే నాకు చాలా మంచి చేశాయి" అని శ్రేయస్‌ చెప్పాడు.

2022లో టీ20 వరల్డ్‌కప్‌ ఆడకపోయినా వన్డేలు, టెస్టుల్లో శ్రేయస్‌ మెరుగ్గా రాణించాడు. అతడు అన్ని ఫార్మాట్లు కలిపి38 ఇన్నింగ్స్‌లో 1489 రన్స్‌ చేశాడు. సౌతాఫ్రికాతో రాంచీలో జరిగిన వన్డేలో 111 బాల్స్‌లో 113 రన్స్‌ అతని అత్యుత్తమ ప్రదర్శన. ఈ మధ్యే బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌లోనూ అతడు కీలక ఇన్నింగ్స్‌తో ఇండియన్‌ టీమ్‌ను గట్టెక్కించాడు.

WhatsApp channel