Afridi Autograph On Indian Flag: అభిమాని కోసం ఇండియా జెండాపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన షాహిద్ అఫ్రిదీ - వీడియో వైర‌ల్‌-shahid afridi gives autograph for fan on indian flag video viral ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Shahid Afridi Gives Autograph For Fan On Indian Flag Video Viral

Afridi Autograph On Indian Flag: అభిమాని కోసం ఇండియా జెండాపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన షాహిద్ అఫ్రిదీ - వీడియో వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 20, 2023 11:27 AM IST

Afridi Autograph On Indian Flag: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో అభిమాని కోరిక‌ను నెర‌వేర్చిన పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిదీ నెటిజ‌న్ల మ‌న‌సుల్ని గెలుచుకున్నాడు.

షాహిద్ అఫ్రిదీ
షాహిద్ అఫ్రిదీ

Afridi Autograph On Indian Flag: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో అభిమాని కోరిక‌ను నెర‌వేర్చిన షాహిద్ అఫ్రిదీ క్రికెట్ ఫ్యాన్స్ మ‌న‌సుల్ని గెలుకున్నాడు. 2018లో క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన ఈ హిట్ట‌ర్ ప్ర‌స్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడుతోన్నాడు. ఇందులో ఆసియా ల‌య‌న్స్‌ టీమ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు షాహిద్ అఫ్రిదీ. శ‌నివారం ఆసియా ల‌య‌న్స్‌, ఇండియా మ‌హ‌రాజాస్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ మ్యాచ్‌లో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఆట‌గాళ్ల కోసం ఏర్పాటుచేసిన బ‌స్‌వైపు షాహిద్ అఫ్రిదీ వెళుతోన్న స‌మ‌యంలో ఓ అభిమాని ఇండియా జెండాపై అత‌డి ఆటోగ్రాఫ్ అడిగాడు.

ఆ అభిమాని కోరిక‌ను తీర్చిన షాహిద్ ఇండియా జెండాపై సంత‌కం చేసి అత‌డికి ఇచ్చాడు. ఇండియా జెండాపై షాహిద్ సంత‌కం చేస్తోన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మంచి మ‌న‌సుతో షాహిద్ క్రికెట్ అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకున్నాడంటూ నెటిజన్లు ఈ వీడియెను ఉద్దేశించి కామెంట్స్ చేస్తోన్నారు.పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ మ్యాచ్‌లో ఇండియా మ‌హ‌రాజాస్‌పై 85 ప‌రుగుల తేడాతో ఆసియా ల‌య‌న్స్ విజ‌యాన్ని సాధించి ఫైన‌ల్ చేరుకున్న‌ది. ఇందులో రెండు ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన షాహిద్ అఫ్రిదీ 9 ప‌రుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. సోమ‌వారం ఆసియా ల‌య‌న్స్‌, వ‌ర‌ల్డ్ జెయింట్స్ మ‌ధ్య లెజెండ్స్ లీగ్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది.

WhatsApp channel