Sania Mirza Fareweel Match: ఎక్కడ మొదలుపెట్టిందో.. అక్కడే ముగించింది.. చివరి మ్యాచ్‌లో ఎమోషనలైన సానియా-sania mirza ends her career in hyderabad lb stadium ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sania Mirza Fareweel Match: ఎక్కడ మొదలుపెట్టిందో.. అక్కడే ముగించింది.. చివరి మ్యాచ్‌లో ఎమోషనలైన సానియా

Sania Mirza Fareweel Match: ఎక్కడ మొదలుపెట్టిందో.. అక్కడే ముగించింది.. చివరి మ్యాచ్‌లో ఎమోషనలైన సానియా

Maragani Govardhan HT Telugu
Mar 05, 2023 05:59 PM IST

Sania Mirza Fareweel Match: టెన్నిస్ దిగ్గజం తన చివరి మ్యాచ్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఆడింది. ఎక్కడైతే తన కెరీర్‌ను మొదలుపెట్టిందో అక్కడే తన కెరీర్‌ను ముగించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సానియా ఎమోషనలైంది.

సానియా మీర్జా
సానియా మీర్జా (PTI)

Sania Mirza Farewell Match: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza) తన చివరి మ్యాచ్ ఈ రోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఆడింది. ఇప్పటికే ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కొలు పలికిన సానియా.. ఈ ఎగ్జిబీషన్ మ్యాచ్‌తో కెరీర్‌ను ముగించనుంది. ఈ సందర్భంగా డబుల్స్ మ్యాచ్ సానియా-బోపన్న, ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీ మధ్య జరుగుతోంది. సింగిల్స్‌లో రోహన్ బోపన్నతో సానియా తలపడుతుంది. సానియా చివరి మ్యాచ్ చూసేందుకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్ తదితరులు ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడైతే తన టెన్నిస్ పాఠాలను ప్రారంభించిందో అక్కడే తన చిట్ట చివరి మ్యాచ్ ఆడి కెరీర్‌ను ముగించింది సానియా. ఎరుపు రంగు కారులో స్టేడియం వద్దకు చేరుకున్న 36 ఏళ్ల సానియాకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వీడ్కోలు ప్రసంగం చేస్తూ ఎమోషనలైంది. రెండు దశాబ్దాలుగా దేశం కోసం ఆడటమే తనకు దక్కిన గొప్ప గౌరవమని ఈ సందర్భంగా పేర్కొంది.

మ్యాచ్‌కు ముందు మాట్లాడుతూ.. "మీ అందరి ముందు నా చివరి మ్యాచ్ ఆడేందుకు చాలా ఉత్సాహంగా ఉంది. 20 ఏళ్లుగా దేశం తరఫున ఆడటం నాకు దక్కిన గొప్ప గౌరవం. తమ దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించాలని ప్రతి క్రీడాకారిణి కలగంటుంది. నేను ఈ కలను సాకారం చేసుకోగలిగాను. నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఇవి చాలా చాలా సంతోషకరమైన కన్నీళ్లు. ఇంతకంటే మంచి సెండ్ ఆఫ్ దొరకదు." అని సానియా మీర్జా స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. సానియా ఎన్నో ఒడుదొడుకులు దాటుకుని ఈ స్థాయికి వచ్చిందని చెప్పారు. క్రీడా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అవసరమని అన్నారు.

20 ఏళ్ల కెరీర్‌లో సానియా మీర్జా డబుల్స్ విభాగంలో ఆరు సార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచింది. ఇందులో మూడు మిక్స్‌డ్ డబుల్స్, మూడు డబుల్స్ విభాగంలో గెలిచింది. అంతేకాకుండా ఎన్నో మరపురాని టైటిళ్లను సానియా సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్ అనంతరం సాయంత్రం ఓ ప్రైవేటు హోటెల్‌ల రెడ్ కార్పెట్ ఈవెంట్, గాలా డిన్నర్ జరగనుంది. ఈ విందుకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, సినీ, క్రీడా ప్రముఖులు మహేష్ బాబు, ఏఆర్ రెహమాన్, సురేష్ రైనా, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు హాజరుకానున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్