Sachin Travel Diaries: ప్రకృతితో మమేకం.. కాలంతో ప్రయాణం.. సచిన్ ప్రపంచ యాత్ర-sachin travel diaries on world tourism day watch this video ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sachin Travel Diaries: ప్రకృతితో మమేకం.. కాలంతో ప్రయాణం.. సచిన్ ప్రపంచ యాత్ర

Sachin Travel Diaries: ప్రకృతితో మమేకం.. కాలంతో ప్రయాణం.. సచిన్ ప్రపంచ యాత్ర

Maragani Govardhan HT Telugu
Sep 27, 2022 08:21 PM IST

Sachin on World Tourism Day 2022: ఈ రోజు ప్రపచం పర్యాటక దినోత్సవం సందర్భంగా సచిన్ తెందూల్కర్.. తన ట్రావెల్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో వైరల్‌గా మారింది.

<p>సచిన్ తెందూల్కర్</p>
సచిన్ తెందూల్కర్ (HT_PRINT)

Sachin Tendulkar Travel Diaries on World Tourism Day: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వంద కోట్ల మంది ఆశలకు ఊపిరులూది 24 ఏళ్ల కెరీర్ ఎన్నో మైలురాళ్లను అందుకున్న అద్వితీయ ఆటగాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తిరుగులేని యోధడు. కెరీర్‌లో ఎన్నో విజయాలు, రికార్డులు అందుకున్న మన మాస్టర్ 2013లో రిటైరైనప్పటి నుంచి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అభిమానులకు చేరువుగా ఉంటున్నారు. పండుగైన, పబ్బమైనా ఎలాంటి సందర్భమైనా సరే పోస్టులను, వీడియోలను ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. అలాగే ప్రపంచ పర్యాటక దినోత్సవం- సెప్టెంబరు 27(World tourism day) రోజైన నేడు ఆయన ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేశాడు. తను తిరిగిన ప్రదేశాలు, కొండలు, సముద్ర తీరాలు, తను గడిపిన మధుర క్షణాలు, ప్రకృతితో మమేకమైన మధురానుభూతులను ఈ వీడియోలో పంచుకున్నాడు.

చిన్న క్లిప్స్ రూపంలో ఉన్న ఈ వీడియోను గమనిస్తే.. సచిన్ తనకు నచ్చిన పర్యాటక ప్రదేశాల్లో తిరిగడమే అక్కడ తనకు సంబంధించిన ముఖ్యమైన సంఘటనలను, దృశ్యాలను ఇందులో చూపించారు. బీచ్‌లో పారాసైలింగ్ చేయడం, మౌంటేన్ రోడ్డుపై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడం, గార్డెన్‌లో సైక్లింగ్ చేయడం, సముద్ర తీరంలో సరదా ఇసుకలో నడవడం ఇలా ఒక్కటేమిటి ప్రకృతిని ఆస్వాదిస్తూ.. తన అనుభవాలను అభిమానులతో వీడియో రూపంలో పంచుకున్నారు.

ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు. ఎప్పుడూ మైదానంలో రెచ్చిపోయి తనదైన శైలిలో ఆటతీరుతో ఆకట్టుకునే సచిన్‌లో మరో కోణం చూసి అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మన మాస్టర్ బ్లాస్టర్‍‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

1989లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మన సచిన్.. దీర్ఘాకాలిక ఫార్మాట్‌లో 200 మ్యాచ్‌లాడి 15,921 పరుగులు చేశాడు. అంతేకాకుండా 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. మొత్తంగా వంద అంతర్జాతీయ సెంచరీలతో ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం