Sachin Tendular Viral Video: సచిన్ తెందూల్కర్ స్టన్నింగ్ షాట్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Sachin Scoop Shot: సచిన్ తెందూల్కర్ అదిరిపోయే స్కూప్ షాట్‌తో ఆకట్టుకున్నాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ స్కూప్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sachin Tendulkar Scoop Shot Viral: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్.. రిటైరై 10 ఏళ్ల కావస్తున్నా.. అతడి ఆటలో పెద్దగా మార్పులేమి లేవు. ఇతర క్రికెటర్లను.. సచిన్‌ను వేరు చేసేది అతడి షాట్ల ఎంపిక. పుల్ షాట్, కవర్ డ్రైవ్, స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఏదైనా కానీ.. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అలాగే టైమింగ్ అదిరిపోతుంది. ప్రత్యర్థి బౌలర్ ఎంత వేగంగా వచ్చి బంతిని సంధిస్తాడో.. అదే తీరులో మెరుపు వేగంతో ఆ బంతిని బౌండరీకి తరలించడం సచిన్ శైలి. తాజాగా సచిన్ ఆటకు మరోసారి ఫిదా అవుతున్నారు అభిమాను. ప్రస్తుతం జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా మాజీ ఆటగాళ్లతో కలిసి వివిధ దేశాలు ఆడుతున్నాయి. ఇందులో ఇండియా లెజెండ్స్ తరఫున మన మాస్టర్ అదిరిపోయే స్కూప్ షాట్‌తో అదరగొట్టారు. ప్రస్తుతం ఈ షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూజిలాండ్ లెజెండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా లెజెంజ్స్ తరఫున సచిన్ తెందూల్కర్ నమన్ ఓజాతో కలిసి ఆకట్టుకున్నాడు. కైల్ మిల్స్ వేసిన తొలి ఓవర్లోనే సచిన్ బ్యాక్ ఫూట్ వేసి కవర్ డ్రైవ్‌తో మొదటి బౌండరీని అందుకున్నాడు. అయితే షేన్ బాండ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో పుల్‌షాట్‌తో మరో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అనంతరం మిల్స్ బౌలింగ్‌లో కొట్టిన స్కూప్ షాట్ అయితే ఫ్యాన్స్‌ను మరింత అబ్బురపరుస్తుంది. ప్రస్తుతం ఈ షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ షాట్‌పై విశేషంగా స్పందిస్తున్నారు.
వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగడంచో ఫలితం తేలలేదు. ఆరు ఓవర్లు మాత్రమే జరిగాయి. అప్పటికే టీమిండియా 5.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. సచిన్ తెందూల్కర్ 13 బంతుల్లో 19 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఓజాతో కలిసి మాస్టర్ 32 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓజా బాండ్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా.. 7 బంతుల్లో 9 పరుగులతో నాటౌట్‌గా సచిన్‌తో పాటు క్రీజులో ఉన్నాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఇండియా లెజెండ్స్ మూడో స్థానంలో నిలిచింది. మూడు మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. నాలుగు పాయింట్లు దక్కించుకుంది. తన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా లెజెండ్స్‌పై 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సచిన్ తెందూల్కర్ 15 బంతుల్లో 16 పరుగులు చేశాడు. ఇందులో రెండు బౌండరీలు ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో వర్షం కారణంగా ఫలితం తేలలేదు.
ఇండియా లెజెండ్స్..
సచిన్ తెందూల్కర్(కెప్టెన్), నమన్ ఓజా, సురేశ్ రైనా, స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, మన్‌ప్రీత్ గోనీ, మునాఫ్ పటేల్, రాహుల్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజా, హర్భజన్ సింగ్, ఎస్ బద్రీనాద్, రాజేశ్ పవార్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్.
న్యూజిలాండ్ లెజెండ్స్..
అన్టోన్ డేవిచ్, జేమీ హౌ, డీన్ బ్రోనైల్, రాస్ టేలర్(కెప్టెన్), కగరేత్ హాప్కిన్స్, స్కాట్ స్టైరిస్, నీల్ బ్రూమ్, కైల్ మిల్ల్, హమీష్ బెనెట్, జాసన్ స్పైస్, జేమ్స్ ఫ్రాంక్లింన్, క్రేగ్ మెక్మిలన్, జాకోబ్ ఓరమ్, షేన్ బాండ్, ఆరోన్ రెడ్మండ్, బ్రూస్ మార్టిన్.
సంబంధిత కథనం