Sachin on Blue Tick: నువ్వే అసలు సచిన్ అని గ్యారెంటీ ఏంటి.. యూజర్ అడిగిన ప్రశ్నకు మాస్టర్ రియాక్షన్ ఇదీ
Sachin on Blue Tick: నువ్వే అసలు సచిన్ అని గ్యారెంటీ ఏంటి అంటూ ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు మాస్టర్ ఫన్నీగా రియాక్టయ్యాడు. నెలవారీ 8 డాలర్లు చెల్లించని వాళ్ల బ్లూటిక్స్ ను ట్విటర్ తొలగిస్తున్న నేపథ్యంలో సచిన్ కూడా తన వెరిఫైడ్ టిక్ కోల్పోయాడు.
Sachin on Blue Tick: ట్విటర్ బ్లూ టిక్ కోల్పోయిన సెలబ్రిటీల్లో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్న విషయం తెలుసు కదా. చాలా మంది ప్రముఖులు ఇలా తమ వెరిఫైడ్ టిక్స కోల్పోయారు. నెలవారీ 8 డాలర్ల సబ్‌స్క్రిప్షన్ తీసుకోని వారి బ్లూటిక్స్ ను ట్విటర్ తొలగిస్తోంది. క్రికెటర్లలో సచిన్ తోపాటు ధోనీ, కోహ్లి, రోహిత్ శర్మలాంటి వాళ్లు కూడా ఈ వెరిఫైడ్ టిక్స్ కోల్పోయారు.
దీంతో ఏ సెలబ్రిటీ ఒరిజినల్ అకౌంట్ ఏది అన్నది తెలుసుకోవడం అభిమానులకు సవాలుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సచిన్ ను కూడా ఓ యూజర్ ఇదే ప్రశ్న అడిగాడు. #AskSachin పేరుతో ఆన్‌లైన్ లో అభిమానుల ప్రశ్నలకు మాస్టర్ సమాధానాలిచ్చాడు. ఈ సందర్భంగా ఓ యూజర్ స్పందిస్తూ.. ఇప్పుడు బ్లూ టిక్ లేదు కదా.. మరి మీరే అసలు సచిన్ అని గ్యారెంటీ ఏంటి అని అడిగాడు.
దీనికి సచిన్ స్పందిస్తూ.. ప్రస్తుతానికి నా బ్లూ టిక్ వెరిఫికేషన్ ఇదే అంటూ తన ఫొటోను షేర్ చేశాడు. అందులో చేతి వేళ్లను టిక్ మాదిరిగా ఉంచడం విశేషం. సచిన్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురువారం (ఏప్రిల్ 20) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలు, ప్రముఖ జర్నలిస్టులు, అధికారులు తమ అకౌంట్లకు ఉన్న వెరిఫైడ్ బ్లూ టిక్స్ కోల్పోయారు.
ఈ టిక్స్ కావాలంటే ప్రతి నెలా 8 డాలర్లు చెల్లించాలంటూ ట్విటర్ ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ ఓ కొత్త రూల్ తీసుకొచ్చిన విషయం తెలుసు కదా. దీంతో ప్రముఖలందరూ తమ బ్లూ టిక్స్ కోల్పోతున్నారు. ఇప్పటికే ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న కొందరికి మాత్రం ఈ బ్లూ టిక్ అలాగే ఉంది.
సచిన్, ధోనీ, రోహిత్, కోహ్లి, పీవీ సింధు, సైనా నెహ్వాల్, నీరజ్ చోప్రా, బజరంగ్ పూనియా, నిఖత్ జరీన్, సానియా మీర్జా, సునీల్ ఛెత్రీలాంటి భారత క్రీడాకారులతోపాటు రొనాల్డో, ఎంబప్పె, ఫెడరర్, నదాల్ లాంటి వాళ్లు కూడా ట్విటర్ బ్లూ టిక్ కోల్పోయారు.
సంబంధిత కథనం