Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ బరిలో నైన్త్ క్లాస్ స్టూడెంట్ -అతి చిన్న వయస్కురాలిగా ఇండియన్ స్విమ్మర్ రికార్డ్
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడుతోన్న అతి చిన్న వయసున్న అథ్లెట్లలో ఒకరిగా ఇండియాకు చెందిన ధినిధి దేశింగు నిలిచింది. ధినిధి వయసు పధ్నాలుగు ఏళ్లు కావడం గమనార్హం. ప్రస్తుతం నైన్త్ క్లాస్ చదువుతోంది.
Paris Olympics: ధినిధి దేశింగు పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన ఇండియన్ అథ్లెట్స్‌లో ఒకరు. స్విమ్మింగ్ లో 200 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో భారత్ నుంచి ఒలింపిక్స్‌లో పతకం కోసం ధినిధి పోటీపడుతోంది. ఆమె వయసు 14 ఏళ్లు కావడం గమనార్హం. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననున్న అతి తక్కువ వయసు ఉన్న అథ్లెట్స్‌లో ఒకరిగా ధినిధి నిలిచింది.
నైన్త్ క్లాస్...
ప్రస్తుతం ధినిధి బెంగళూరులోని సీవీ రామన్ నగర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నైన్త్ క్లాస్ చదువుతోంది. 2010 మే 17న జన్మించింది ధినిధీ. 2018 నుంచి స్విమ్మింగ్‌లో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. తక్కువ కాలంలోనే జూనియర్, సబ్ జూనియర్ స్విమ్మింగ్ పోటీల్లో పలు పతకాలు సాధించింది. గోవాలో జరిగిన నేషనల్ గేమ్స్‌లో ఏడు గోల్డ్ మెడల్స్ సాధించి రికార్డ్ నెలకొల్పింది.
వరల్డ్ ఛాంపియన్‌షిప్ తో పాటు ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్నది. ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న అతి చిన్న వయసు స్మిమ్మర్‌గా ధినిధి నిలిచింది. ఇంటర్నేషనల్ స్మిమ్మింగ్ పోటీల్లో ధినిధి పలు పతకాలు సాధించింది. అంతే కాకుండా 200 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో నేషనల్ రికార్డు ధినిధి పేరు మీదనే ఉంది.
అర్తి సాహా తర్వాత…
1952 ఒలింపిక్స్‌లో ఆర్తి సాహా 11 ఏళ్ల వయసులో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆమె తర్వాత అతి తక్కువ వయసులో ఒలింపిక్స్ బరిలో దిగుతోన్న అథ్లెట్‌గా ధినిధి రికార్డ్ నెలకొల్పింది. అర్తి సాహా కూడా స్విమ్మింగ్ ఈవెంట్‌లోనే ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యింది.
పదకొండుఏళ్లకే...
పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడుతోన్న అథ్లెట్లలో అతి తక్కువ వయసున్న క్రీడాకారిణిగా చైనాకు జెంగ్ హోహో నిలిచింది. పదకొండు సంవత్సరాల పదకొండు నెలల వయసులోనే జెంగ్ పారిస్ ఒలింపిక్స్‌లో స్కేటింగ్స్ గేమ్స్‌లో పతకం కోసం బరిలోకి దిగుతోంది. ఆగస్ట్ 11కు జెంగ్ పన్నెండేళ్ల వయసులోకి అడుగుపెడుతుంది.
61 ఏళ్లకు క్వాలిఫై...
పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడుతోన్న అతిపెద్ద అథ్లెట్‌గా కెనడాకు చెందిన జిల్ ఇర్వింగ్ నిలిచింది. 61 ఏళ్ల వయసులో ఎంతో కఠినమైన ఈక్వెస్ట్రియన్ గేమ్స్‌లో ఇర్వింగ్ బరిలో దిగడం గమనార్హం. ఇర్వింగ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. 61 ఏళ్లకు ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయి రికార్డ్ సృష్టించింది. ఇండియా నుంచి పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటోన్న అథ్లెట్లలో అతి పెద్ద వయస్కుడిగా రోహన్ బోపన్న నిలిచాడు. ఈ టెన్నిస్ స్టార్ వయసు ప్రస్తుతం 44 ఏళ్లు.