Pakistan Icc Odi Ranking: అయ్యో... న‌ల‌భై ఎనిమిది గంట‌ల్లోనే పాకిస్థాన్ నంబ‌ర్ వ‌న్ ర్యాంక్ గ‌ల్లంతు-pakistan team lost icc odi no 1 rank in 48 hours ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Pakistan Team Lost Icc Odi No 1 Rank In 48 Hours

Pakistan Icc Odi Ranking: అయ్యో... న‌ల‌భై ఎనిమిది గంట‌ల్లోనే పాకిస్థాన్ నంబ‌ర్ వ‌న్ ర్యాంక్ గ‌ల్లంతు

పాకిస్థాన్ క్రికెట్ టీమ్
పాకిస్థాన్ క్రికెట్ టీమ్

Pakistan Icc Odi Ranking: ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ నంబ‌ర్ వ‌న్ ర్యాంకు ఆనందం న‌ల‌భై ఎనిమిది గంట‌ల్లోనే ఆవిరైంది. శుక్ర‌వారం నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉన్న పాకిస్థాన్ ఆదివారం నాటికి మూడో స్థానానికి ప‌డిపోయింది.

Pakistan Icc Odi Ranking: ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ నంబ‌ర్ వ‌న్ ఆనందం ప‌ట్టుమ‌ని రెండు రోజులు కూడా నిల‌వ‌లేదు. శుక్ర‌వారం ప్ర‌క‌టించిన ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌కు చేరుకున్న‌ సంగ‌తి తె లిసిందే. న్యూజిలాండ్‌తో ఐదు వ‌న్డేల సిరీస్‌లో వ‌రుస‌గా నాలుగు వ‌న్డేల్లో విజ‌యాన్ని సాధించిన‌ పాకిస్థాన్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ చరిత్రలో తొలిసారి నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌కు చేరుకున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

కానీ ఆదివారం జ‌రిగిన చివ‌రి వ‌న్డేలో పాకిస్థాన్ 47 ప‌రుగుల‌తో ఓట‌మి పాలైంది. ఈ వ‌న్డేలో ఓట‌మితో పాకిస్థాన్ నంబ‌ర్ వ‌న్ ర్యాంక్ గ‌ల్లంతైంది. నంబ‌ర్ వ‌న్ ప్లేస్ నుంచి మూడో స్థానానికి ప‌డిపోయింది. 113 రేటింగ్స్ పాయింట్స్‌తో ఆస్ట్రేలియా నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిల‌వగా...ఇండియా రెండో స్థానానికి చేరుకున్న‌ది.

పాకిస్థాన్ మూడో స్థానానికి దిగ‌జారింది. చివ‌రి వ‌న్డేలో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలిస్తే నంబ‌ర్ వ‌న్ ర్యాంకు ప‌దిలంగా ఉండేది. కానీ ఓట‌మితో మూడో స్థానానికి ప‌డిపోవ‌డంతో బాబ‌ర్ ఆజాం టీమ్‌ను సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు.

నిఫ్టీ, ఫారెక్స్ స‌ర్వీసెస్ కంటే వేగంగా పాకిస్థాన్ నంబ‌ర్ వ‌న్ ర్యాంకు ప‌డిపోయింద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. నెటిజ‌న్ల‌ ఫ‌న్నీ మీమ్స్‌, ట్రోల్స్ వైర‌ల్ అవుతోన్నాయి. కాగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో ఫ‌క‌ర్ జ‌మాన్‌తో పాటు కెప్టెన్ బాబ‌ర్ అజామ్ రాణించారు.

టాపిక్