Moeen Ali Praises Suryakumar: అతడు నన్ను చంపేసినంత పనిచేశాడు.. మొయిన్ అలీ సంచలన వ్యాఖ్యలు
Moeen Ali Praies Suryakumar: ఇంగ్లాండ్ క్రికెటర్ మొయిన్ అలీ.. భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మ్యాచ్‌లో ఆటతీరుతో దాదాపు చంపినంత పనిచేశాడని స్పష్టం చేశాడు.
Moeen Ali Praies Suryakumar: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. బుధవారం నాడు తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య జరగనుండగా.. రెండో మ్యాచ్ గురువారం నాడు భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాతో తన అస్త్రాలను సంసిద్దం చేసుకుంది. మరోపక్క ఇంగ్లాండ్ కూడా భారత్‌పై ఆధిపత్యం సాధించాలని పట్టుదలతో ఉంది. అయితే ప్రస్తుతం అందరి చూపు మాత్రం సూర్యకుమార్ యాదవ్‌పైనే ఉంది. అతడు భీకర ఫామ్‌లో ఉండటంతో పరుగుల వరదకు అడ్డుకట్ట వేయాలని ఇంగ్లాండ్ తలస్తుండగా.. మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడాలని టీమిండియా కోరుకుంటోంది. ఇదిలా ఉంటే ఇంగ్లీష్ ఆటగాడు మొయిన్ అలీ మాత్రం సూర్యకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడని కితాబిచ్చాడు.
"సూర్యకుమార్ అద్భుతమైన ఆటగాడు. అతడు ప్రపంచంలోనే బెస్ట్ ఆటగాడని నాకు అనిపిస్తుంది. టీ20 క్రికెట్‌ను అతడు వేరే స్థాయికి తీసుళ్తాడని అనుకుంటున్నా. అతడు బాగా ఆడుతున్నప్పుడు.. బౌలింగ్ చేయలేరు. బహుశా ఈ విషయంలో అతడే మొదటి వ్యక్తి కావచ్చు. ఎందుకంటే సూర్యకుమార్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు అతడి బలహీనత కూడా బయటపడదు." అని మొయిన్ అలీ ప్రశంసించాడు.
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌పై టీ20ల్లో సూర్యకుమార్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 55 బంతుల్లోనే 117 పరుగులు చేసిన అతడు.. 14 ఫోర్లు, 6 సిక్సర్లతో ఇంగ్లీష్ బౌలర్లను బెంబేలెత్తించాడు. తన 360 డిగ్రీల ఆటతీరుతో వారిని విస్మయానికి గురి చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ సూర్యకుమార్ ఆటకు మాత్రం ఇంగ్లాండ్ ఆటగాళ్లు షాక్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో అతడు వికెట్ తీసిన మొయిన్ అలీ ఆ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. సూర్యకుమార్ దాదాపు నన్ను చంపేసినంత పనిచేశాడని స్పష్టం చేశాడు.
"నేను అతడిని ఔట్ చేయకముందే అతడు నన్ను దాదాపు చంపేసినంత పనిచేశాడు. ఆ మ్యాచ్‌లో వారికి ఇంకా చాలా పరుగులు కావాలి. ఇలాంటి సమయంలో అతడు విజయాన్ని వారికి చాలా చేరువ చేశాడు. నేను ఔట్ అతడిని ఔట్ చేసినప్పుడు అప్పటికే అలసిపోయాడు. అప్పడు అర్థమైంది. అతడు ఎలా ఔటయ్యాడో. కానీ అతడు అద్భుతంగా ఆడాడు. కొన్ని షాట్లయితే నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు." అని మొయిన్ అలీ అన్నాడు.
సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో అతడు అత్యుత్తమంగా ఆడుతున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 75 సగటుతో 225 పరుగులు చేశాడు. ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్‌లో అతడు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో 28 ఇన్నింగ్సుల్లోనే 44.60 సగటుతో 1026 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం సహా 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 1000కి పైగా పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా సూర్యకుమార్ ఘనత సాధించాడు.
సంబంధిత కథనం