Mithali Raj in WPL: వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో మిథాలీ రాజ్.. కానీ ప్లేయర్‌గా కాదు!-mithali raj in wpl as mentor of gujarat giants team ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Mithali Raj In Wpl As Mentor Of Gujarat Giants Team

Mithali Raj in WPL: వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో మిథాలీ రాజ్.. కానీ ప్లేయర్‌గా కాదు!

Hari Prasad S HT Telugu
Jan 27, 2023 04:06 PM IST

Mithali Raj in WPL: వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో మిథాలీ రాజ్ కనిపించబోతోంది. కానీ ప్లేయర్ గా మాత్రం కాదు. ఆడటానికి ఆమె ఆసక్తి చూపినా.. ఫ్రాంఛైజీలు మాత్రం అందుకు సిద్ధంగా లేవని సమాచారం.

మిథాలీ రాజ్
మిథాలీ రాజ్ (PTI)

ట్రెండింగ్ వార్తలు

Mithali Raj in WPL: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కు సుమారు రెండున్నర దశాబ్దాల పాటు సేవలందించి గతేడాది రిటైరైన మిథాలీ రాజ్ మరోసారి క్రికెట్ ఫీల్డ్ లో కనిపించనుంది. అయితే ఈసారి ప్లేయర్ గా మాత్రం కాదు. ఈ లీగ్ లో అహ్మదాబాద్ ఫ్రాంఛైజీగా ఉన్న గుజరాత్ జెయింట్స్ టీమ్ మెంటార్ గా మిథాలీ వ్యవహరించబోతోంది.

నిజానికి ఈ లీగ్ లో ఆడటానికి మిథాలీ చాలా ఆసక్తి చూపింది. ఒకవేళ అవకాశం వస్తే తాను రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చి తొలి వుమెన్స్ లీగ్ లో ఆడతానని కూడా చెప్పింది. అయితే ఆమెను ఓ ప్లేయర్ గా తీసుకోవడానికి లీగ్ లోని టీమ్స్ ముందుకు రాలేదు. చివరికి గుజరాత్ జెయింట్స్ టీమ్ మాత్రం ఆమెకు మెంటార్ గా అవకాశం ఇచ్చినట్లు న్యూస్ 18 వెల్లడించింది.

ముంబై నుంచి ఉండే టీమ్ తరఫున ఆడాలని మిథాలీ భావించినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. 40 ఏళ్ల మిథాలీ గతేడాది క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇండియా తరఫున ఆమె 89 టీ20ల్లో ఆడింది. వీటిలో 37.52 సగటుతో 2364 రన్స్ చేసింది. 2019లో చివరిసారి ఆమె ఓ టీ20లో ఆడింది. ఆ తర్వాత మూడేళ్లపాటు వన్డేలు, టెస్టుల్లో ఆడిన ఆమె గతేడాది జూన్ లో రిటైరైంది.

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జెయింట్స్ టీమ్ ను అదానీ స్పోర్ట్స్ లైన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ లో అత్యధిక ధర పలికిన ఫ్రాంఛైజీ ఇదే. రూ.1289 కోట్లు చెల్లించి అదానీ గ్రూప్ ఈ ఫ్రాంఛైజీని దక్కించుకుంది. మొత్తంగా లీగ్ లోని ఐదు టీమ్స్ ద్వారా బీసీసీఐకి రూ.4670 కోట్లు రావడం విశేషం.

అహ్మదాబాద్ తోపాటు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో టీమ్స్ ఉన్నాయి. తొలి డబ్ల్యూపీఎల్ ఈ ఏడాది మార్చిలో జరగనుంది. మహిళల క్రికెట్ టీమ్స్ ఈ స్థాయి ధర పలకడాన్ని భారత క్రికెట్ లో ఓ చారిత్రక రోజుగా బీసీసీఐ కార్యదర్శి జై షా అభివర్ణించారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్