Chandrakant Pandit: కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త కోచ్ చంద్రకాంత్ పండిట్
Chandrakant Pandit: ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్‌ను మార్చింది. వచ్చే సీజన్ నుంచి ఆ టీమ్‌కు చంద్రకాంత్ పండిట్ కోచ్‌గా ఉండనున్నాడు.
న్యూఢిల్లీ: చంద్రకాంత్ పండిట్.. ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్‌లో ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు. ఈ ఏడాది మధ్యప్రదేశ్‌ను తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిపిన కోచ్ అతడు. ఇప్పుడతన్ని ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ కొత్త కోచ్‌గా నియమించింది. ఇప్పటి వరకూ కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో చంద్రకాంత్‌ను తీసుకోవడం విశేషం.
ఇంగ్లండ్ కోచ్‌గా మెకల్లమ్.. అక్కడే పూర్తిస్థాయిలో దృష్టిసారించాలన్న ఉద్దేశంతో కోల్‌కతా టీమ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తనను కోల్‌కతా కోచ్‌గా నియమించడంపై చంద్రకాంత్ స్పందించాడు. ఇది తనకెంతో గర్వకారణమని అన్నాడు. "ఈ బాధ్యతలు స్వీకరించడాన్ని నేను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో కుటుంబ సంస్కృతి, గెలవాలన్న తపన కలిగించే సాంప్రదాయం ఉంటుందని నేను కొంతమంది ప్లేయర్స్, ఇతరుల ద్వారా విన్నాను. టీమ్‌లోని క్వాలిటీ సపోర్ట్ స్టాఫ్,ప్లేయర్స్‌తో కలిసి పని చేయనుండటం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. సానుకూల అంచనాలతో ఈ బాధ్యతలను స్వీకరించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని చంద్రకాంత్ పండిట్ అన్నాడు.
గతంలో ఇండియన్ టీమ్ వికెట్ కీపర్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్.. కోచ్‌గా ఎక్కువ విజయవంతమయ్యాడు. విదర్భ కోచ్‌గా 2018, 2019లలో ఆ టీమ్‌ను రంజీ ట్రోఫీ విజేతగా నిలిపాడు. తాజా మధ్యప్రదేశ్‌ను కూడా తొలిసారి ఈ అత్యుత్తమ దేశవాళీ టోర్నీలో విజేతను చేశాడు. తాను మధ్యప్రదేశ్ కెప్టెన్‌గా చేయలేని పనిని, కోచ్‌గా చేసి చూపించాడు.