Jyothi Yarraji: భారత్ ఖాతాలో పసిడి.. జ్యోతి యర్రాజీకి స్వర్ణం.. తన రికార్డ్ తానే బద్దలు కొట్టి!-jyothi yarraji wins gold medal in asian indoor athletics championships 2024 with record breaking 60 m hurdles ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Jyothi Yarraji: భారత్ ఖాతాలో పసిడి.. జ్యోతి యర్రాజీకి స్వర్ణం.. తన రికార్డ్ తానే బద్దలు కొట్టి!

Jyothi Yarraji: భారత్ ఖాతాలో పసిడి.. జ్యోతి యర్రాజీకి స్వర్ణం.. తన రికార్డ్ తానే బద్దలు కొట్టి!

Sanjiv Kumar HT Telugu
Feb 18, 2024 10:58 AM IST

Jyothi Yarraji Gold Medal: ఆసియన్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లేట్ జ్యోతి యర్రాజీ స్వర్ణం గెలుచుకుంది. 60 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లో జాతీయ రికార్డ్ టైమింగ్‌తో గోల్డ్ మెడల్ సాధించి భారత్‌కు మరో పతకం తీసుకొచ్చింది.

భారత్ ఖాతాలో పసిడి.. జ్యోతి యర్రాజీకి స్వర్ణం.. తన రికార్డ్ తానే బద్దలు కొట్టి!
భారత్ ఖాతాలో పసిడి.. జ్యోతి యర్రాజీకి స్వర్ణం.. తన రికార్డ్ తానే బద్దలు కొట్టి!

Asian Indoor Athletics 2024: భారత్ అథ్లెట్ జ్యోతి యర్రాజి టెహ్రాన్ (ఇరాన్)లో జరుగుతున్న ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది. 60 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లో 8.12 సెకన్ల కొత్త జాతీయ రికార్డ్ టైమింగ్‌తో స్వర్ణం గెలుచుకుని భారతదేశానికి మొదటి పతకాన్ని తీసుకొచ్చింది. గత సంవత్సరం కజకిస్తాన్‌లో జరిగిన ఎడిషన్ నుంచి తన సొంత ఎన్‌ఆర్‌ను మెరుగుపరుచుకున్న జ్యోతి ఈ ప్రదర్శనతో 2024 సీజన్ ఓపెనర్‌గా నిలిచింది. అక్కడ ఆమె రజతం గెలుచుకుంది.

ఇదిలా ఉంటే, గతేడాది తాను నెలకొల్పిన 8.13 సెకన్ల జాతీయ రికార్డును జ్యోతి యర్రాజీ బద్దలు కొట్టడం విశేషం. ఈ ఈవెంట్ హీట్స్‌ను 8.22 సెకన్లతో ముగించిన జ్యోతి ఫైనల్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అసుకా టెరెడా (జపాన్ 8.21 సె.), లుయి లై యు (హాంకాంగ్ 8.21 సె.) రజత, కాంస్యా పతకాలు గెలుచుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ భువనేశ్వర్‌లోని రిలయన్స్ ఫౌండేషన్ హై పెర్ఫామెన్స్ సెంటర్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది.

గోల్డ్ మెడల్ సాధించడంపై జ్యోతి యర్రాజీ తన ఆనందాన్ని పంచుకుంది. "ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ చాలా మంచి అనుభవం. ఇది ప్రారంభ సీజన్‌లో మొదటి అంతర్జాతీయ పోటీ. కాబట్టి నేను నా ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉన్నాను. ఈ బంగారు పతకం ప్రత్యేకం. గత వారం మజిల్ పెయిన్ వల్ల నేను కొంచెం ఆందోళన చెందాను. కానీ, రిలయన్స్ ఫౌండేషన్‌లోని నా బృందం, ఫిజియోథెరపిస్ట్‌లు నన్ను పోటీకి రెడీ చేసేందుకు చాలా కష్టపడ్డారు" అని జ్యోతి యర్రాజీ తెలిపింది.

అలాగే "నేను పోటీకి సిద్ధం కావడానికి సహాయం చేసిన ఒడిశా ప్రభుత్వానికి, రిలయన్స్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను సీజన్‌ను ప్రారంభించిన విధానం పట్ల నేను సంతోషంగా ఉన్నాను" అని జ్యోతి యర్రాజీ చెప్పుకొచ్చింది. ఈ పోటీల కోసం జ్యోతి యర్రాజీ కళింగ ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియంలో శిక్షణ పొందింది. ఒడిశా రిలయన్స్ ఫౌండేషన్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ నిర్వహించిన మొదటి ఇండోర్ అథ్లెటిక్స్ టెస్ట్ మీట్‌లో కూడా ఆమె పాల్గొంది.

జ్యోతి 2023 నుంచి తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. అక్కడ ఆమె ఆసియా క్రీడలలో 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లో రజతం గెలుచుకుంది. అలాగే ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో రెండు పతకాలను కూడా గెలుచుకుంది. అయితే, మొత్తం 15 మంది అథ్లెట్లలో 7 మంది అథ్లెట్లు ఆసియా ఇండోర్ ఛాంపియన్‌షిప్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉల్వే (స్ప్రింట్స్ అండ్ త్రోస్), కూనూర్ (ఎండ్యూరెన్స్), భువనేశ్వర్ (జంప్స్)లోని ఆర్ఎఫ్ సెంటర్‌లలో శిక్షణ పొందుతున్నారు.

కాగా ఈ ఛాంపియన్‌షిప్‌లో శనివారం మరో రెండు స్వర్ణాలు ఇండియా ఖాతాలో చేరాయి. పురుషుల షాట్‌పుట్‌లో తజీందర్ పాల్ సింగ్ తూర్ స్వర్ణం సాధించాడు. తన రెండో ప్రయత్నంలో అతను గుండును 19.71 మీటర్లు విసిరి అగ్ర స్థానం సంపాదించుకున్నాడు. మహిళల 1500 మీటర్ల పరుగులో హర్‌మిలన్ బైన్స్ స్వర్ణం అందుకుంది. రేస్‌ను హర్‌మిలన్ 4 నిమిషాల 29.55 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ సాధించింది.

WhatsApp channel