Rohit Sharma Telugu: పదండి ఉప్పల్ స్టేడియానికి.. రోహిత్ తెలుగులో మాట్లాడిన వీడియో చూశారా?-rohit sharma speaks in telugu as he welcomes fans to uppal stadium ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Rohit Sharma Speaks In Telugu As He Welcomes Fans To Uppal Stadium

Rohit Sharma Telugu: పదండి ఉప్పల్ స్టేడియానికి.. రోహిత్ తెలుగులో మాట్లాడిన వీడియో చూశారా?

Hari Prasad S HT Telugu
Apr 18, 2023 07:04 PM IST

Rohit Sharma Telugu: పదండి ఉప్పల్ స్టేడియానికి అంటూ రోహిత్ తెలుగులో మాట్లాడిన వీడియో చూశారా? ఈ వీడియోను ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (PTI)

Rohit Sharma Telugu: టీమిండియా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడటం ఎప్పుడైనా చూశారా? మన తెలుగు అభిమానులను ఆకర్షించడానికి ముంబై ఇండియన్స్ ఓ వినూత్న ప్రయత్నం చేసింది. రోహిత్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన తర్వాత అతనితో తెలుగులో మాట్లాడించిన ఓ వీడియోను రిలీజ్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

అందులో రోహిత్ వచ్చీ రాని తెలుగులో మాట్లాడటం నవ్వు తెప్పిస్తుంది. ఇంగ్లిష్ లో రాసిచ్చిన లైన్ ను అతడు తెలుగులో చదవినట్లు అనిపించింది. "మేము వచ్చేసినాము.. ఎంఐ ఫ్యాన్స్.. పదండి ఉప్పల్‌కు" అంటూ రోహిత్ చిరునవ్వులు చిందిస్తూ చెప్పడం విశేషం. ఈ వీడియోను ముంబై ఫ్రాంఛైజీ ట్విటర్ లో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయింది.

మంగళవారం (ఏప్రిల్ 18) సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ రెండు టీమ్స్ వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి హ్యాట్రిక్ విజయాలపై కన్నేశాయి. మరి వీరిలో ఎవరు హ్యాట్రిక్ సాధిస్తారన్నది ఆసక్తిగా మారింది. నిజానికి ఈ రెండు టీమ్స్ ఈ సీజన్ లో ఆడిన తొలి రెండు మ్యాచ్ లలో ఓడిపోయాయి.

అయితే తర్వాత పుంజుకొని వరుస విజయాలు సాధించాయి. సన్ రైజర్స్ లో హ్యారీ బ్రూక్ సెంచరీతో ఫామ్ లోకి రావడం టీమ్ బలాన్ని పెంచింది. కెప్టెన్ మార్‌క్రమ్, క్లాసెన్, జాన్సెన్ లాంటి విదేశీ ఆటగాళ్లంతా మంచి ఫామ్ లో ఉన్నారు. దీంతో సొంతగడ్డపై ముంబైని ఓడించాలని సన్ రైజర్స్ చూస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం