Rahul Tewatia: మూడు నాలుగేళ్లుగా అదే ప్రాక్టీస్ చేస్తున్నా.. చివరి ఓవర్ ఫినిష్‌లపై రాహుల్ తెవాతియా-rahul tewatia says he is practicing to finish the matches for the last four years ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rahul Tewatia: మూడు నాలుగేళ్లుగా అదే ప్రాక్టీస్ చేస్తున్నా.. చివరి ఓవర్ ఫినిష్‌లపై రాహుల్ తెవాతియా

Rahul Tewatia: మూడు నాలుగేళ్లుగా అదే ప్రాక్టీస్ చేస్తున్నా.. చివరి ఓవర్ ఫినిష్‌లపై రాహుల్ తెవాతియా

Hari Prasad S HT Telugu
Apr 14, 2023 10:19 AM IST

Rahul Tewatia: మూడు నాలుగేళ్లుగా అదే ప్రాక్టీస్ చేస్తున్నా అంటూ చివరి ఓవర్ ఫినిష్‌లపై రాహుల్ తెవాతియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గురువారం (ఏప్రిల్ 13) పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో మరోసారి రాహుల్ చివరి ఓవర్ ఐదో బంతికి గుజరాత్ కు విజయం సాధించి పెట్టిన విషయం తెలిసిందే.

రాహుల్ తెవాతియా
రాహుల్ తెవాతియా (AP)

Rahul Tewatia: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని అందరూ మిస్టర్ కూల్ అంటారు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా కనిపిస్తాడని అతనికా పేరు. కానీ క్రికెట్ లోకి కొత్తగా ఓ ఐస్ మ్యాన్ వచ్చాడు. అతని పేరు రాహుల్ తెవాతియా. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగే మ్యాచ్ లలో గెలిపించడం అలవాటు మార్చుకున్న ఈ ఐస్ మ్యాన్.. తాజాగా అలాంటి మరో అద్భుతం చేశాడు. ఎంతో ఒత్తిడిలో చివరి ఓవర్లో క్రీజులో అడుగుపెట్టినా.. తనదైన స్టైల్లో మ్యాచ్ ముగించాడు.

రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమైన సమయంలో ఓ డేరింగ్ స్కూప్ షాట్ తో గుజరాత్ టైటన్స్ ను గెలిపించాడు. గతేడాది కూడా ఇలాంటి ఇన్నింగ్స్ అతడు చాలానే ఆడాడు. 2022లో ఇదే పంజాబ్ కింగ్స్ పై చివరి ఓవర్లో రెండు సిక్స్ లు కొట్టి గెలిపించాడు. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ కు ఆడే సమయంలోనూ ఇదే టీమ్ పై ఒకే ఓవర్లో ఐదు సిక్స్ లు బాది ఊహకందని విజయం సాధించిపెట్టాడు.

నాలుగేళ్లుగా ఇదే ప్రాక్టీస్

మరి ఇంత ఒత్తడిలోనూ అంత ప్రశాంతంగా అతడు ఎలా మ్యాచ్ లు గెలిపించగలుగుతున్నాడు. దీనికి పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ తర్వాత రాహుల్ తెవాతియానే సమాధానమిచ్చాడు. తాను మూడు, నాలుగేళ్లుగా ఇదే ప్రాక్టీస్ చేస్తున్నానని అతడు అనడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ టీమ్ తో ఉన్నప్పటి నుంచే తనకు ఇది అలవాటైందని చెప్పాడు.

"లెగ్ సైడ్ బౌండరీ దూరంగా ఉంది. రెండు పరుగులు తీయొచ్చనుకున్నా కానీ అది రిస్క్ అనిపించింది. ర్యాంప్ షాట్ ఆడటం బెటర్ అని నా మనసులో అనుకున్నా. దానికి పర్ఫెక్ట్ గా అమలు చేయగలిగాను" అని తెవాతియా వెల్లడించాడు.

"2020లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడే సమయంలోనే నాకు ఈ ఫినిషర్ రోల్ ఇచ్చారు. 14 లీగ్ మ్యాచ్ లలో 8 లేదా 9 సార్లు అలాంటి పరిస్థితుల్లో ఆడాలి. చాలాసార్లు బ్యాటింగ్ 13-14 ఓవర్లలో వచ్చేది. గత మూడు, నాలుగేళ్లుగా ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాను. మ్యాచ్ పరిస్థితులకు తగినట్లు లక్ష్యాలను సెట్ చేసుకుంటాను. నెట్స్ లోనూ మ్యాచ్ లాంటి పరిస్థితులను క్రియేట్ చేసుకోవడం వల్ల ఆ పరిస్థితులలో ఎలా ఆడాలో, మ్యాచ్ ఎలా ముగించాలో నాకు ఐడియా వచ్చేది" అని తెవాతియా చెప్పాడు.

WhatsApp channel

సంబంధిత కథనం