Moody on Kohli: ఆర్సీబీ ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ చేరుతుందా లేదా? ఇప్పుడిదే క్రికెట్ అభిమానుల ముందున్న ప్రశ్న. అయితే దీనికి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ నేరుగా సమాధానమిచ్చాడు. ఆర్సీబీని ప్లేఆఫ్స్ చేర్చడానికి విరాట్ కోహ్లి ఏదైనా చేస్తాడని అతడు అనడం విశేషం. ఆ టీమ్ మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా.. గురువారం (మే 18) సన్ రైజర్స్ హైదరాబాద్ పై కచ్చితంగా గెలవాల్సి ఉంది.
ఐపీఎల్ 2023లో ఇప్పటికే గుజరాత్ టైటన్స్ టీమ్ ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. టాప్ 2లోనూ ఉండనుంది. మిగతా మూడు స్థానాల కోసం సాంకేతికంగా ఏడు టీమ్స్ పోటీలో ఉన్నాయి. వీటిలోనూ ప్రధానంగా పోటీ సీఎస్కే, లక్నో, ఆర్సీబీ, ముంబై, రాజస్థాన్ రాయల్స్ మధ్యే ఉండనుంది. ఒకవేళ సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోతే 15 పాయింట్లతో ఉన్న సీఎస్కే, లక్నో టీమ్స్ ప్లేఆఫ్స్ చేరుకుంటాయి.
దీంతో ఆర్సీబీ ఓటమి కోసం ఆ జట్లు ప్రార్థిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కీలకమైన మ్యాచ్ పై సన్ రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూవీ స్పందించాడు. "సగం టోర్నీ తర్వాత ఆర్సీబీ ఫామ్ కోల్పోయింది. బాగానే మొదలుపెట్టినా రెండో రౌండ్ లో లయ తప్పారు. అందుకే మిగతా మ్యాచ్ లలో గెలిస్తేనే ప్లేఆఫ్స్ ఛాన్స్ ఉండటంతో వాళ్లు పూర్తి సామర్థ్యంతో ఆడాలి. వాళ్ల దగ్గర విరాట్ కోహ్లిలాంటి ప్లేయర్ ఉన్నాడు. ఆర్సీబీని ప్లేఆఫ్స్ రేసులో ఉంచడానికి అతడు తన పరిధిలో ఉన్నవన్నీ చేస్తాడు" అని మూడీ స్పష్టం చేశాడు.
ఇక టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కూడా ఆర్సీబీ ఆటతీరును నిందించాడు. వాళ్ల దగ్గర టీమ్ వర్క్ లేదని అన్నాడు. "ఆర్సీబీ ఓ జట్టులా ఆడాలి. ఆ ముగ్గురు ప్లేయర్స్ (కోహ్లి, డుప్లెస్సి, మ్యాక్స్‌వెల్)పై ఆధారపడకూడదు. ప్రతి ఆటగాడు ముందుకు వచ్చి తమ బాధ్యతను నెరవేర్చాలి" అని పఠాన్ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం