IPL 2023 Points Table: ఆరెంజ్ క్యాప్‌లో టాప్ ఫోర్‌లోకి కేఎల్ రాహుల్ - ప‌ర్పుల్ క్యాప్‌లో అర్ష‌దీప్ నంబ‌ర్ వ‌న్‌-ipl 2023 points table orange and purple cap leaders updated list after mi vs pbks match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Points Table: ఆరెంజ్ క్యాప్‌లో టాప్ ఫోర్‌లోకి కేఎల్ రాహుల్ - ప‌ర్పుల్ క్యాప్‌లో అర్ష‌దీప్ నంబ‌ర్ వ‌న్‌

IPL 2023 Points Table: ఆరెంజ్ క్యాప్‌లో టాప్ ఫోర్‌లోకి కేఎల్ రాహుల్ - ప‌ర్పుల్ క్యాప్‌లో అర్ష‌దీప్ నంబ‌ర్ వ‌న్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 23, 2023 09:57 AM IST

IPL 2023 Points Table: ముంబైపై అద్భుత విజ‌యంతో పాయింట్స్ టేబుల్‌లో పంజాబ్ కింగ్స్ ఐదో స్థానానికి చేరుకున్న‌ది. ప‌ర్పుల్ క్యాప్ లీడ‌ర్స్‌లో పంజాబ్ పేస‌ర్ అర్ష‌దీప్ సింగ్ టాప్ ప్లేస్‌ను ద‌క్కించుకొన్నాడు.

అర్ష‌దీప్ సింగ్
అర్ష‌దీప్ సింగ్

IPL 2023 Points Table: ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో పంజాబ్ కింగ్స్ ఐదో స్థానానికి చేరుకున్న‌ది. మ‌రోవైపు గుజ‌రాత్ చేతిలో ఓట‌మి పాలైన ల‌క్నో...రెండో స్థానాన్ని మాత్రం కోల్పోలేదు. శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌పై 13 ప‌రుగులు తేడాతో థ్రిల్లింగ్ విక్ట‌రీని అందుకున్న పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌ను వెన‌క్కి నెట్టి ఐదో ప్లేస్‌కు చేరుకున్న‌ది.

బెంగ‌ళూరు ఆరో స్థానానికి ప‌డిపోయింది. మ‌రోవైపు గుజ‌రాత్‌పై స్వ‌ల్ప స్కోరును ఛేదించ‌లేక చ‌తికిల ప‌డిన ల‌క్నో రెండో స్థానం మాత్రం కోల్పోక‌పోవ‌డం ఊర‌ట‌నిచ్చింది. పాయింట్స్ టేబుల్‌లో రాజ‌స్థాన్ టాప్ ప్లేస్‌లోనే కొన‌సాగుతోండ‌గా , ల‌క్నో రెండు, చెన్నై మూడు, గుజ‌రాత్ నాలుగో స్థానాల్లో నిలిచాయి. ఏడు మ్యాచుల్లో మూడు విజ‌యాలు, మూడు ఓట‌ముల‌తో ముంబై ఏడో స్థానంలో నిలిచింది.

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌
ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌

డుప్లెసిస్ వ‌ర్సెస్ వార్న‌ర్‌

ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్ లిస్ట్‌లో డుప్లెసిస్ ఫ‌స్ట్ ప్లేస్‌లో కొన‌సాగుతోన్నాడు. ఆరు మ్యాచుల్లో 68 యావ‌రేజ్‌తో 343 ర‌న్స్ చేశాడు డుప్లెసిస్‌. 285 ర‌న్స్‌తో డేవిడ్ వార్న‌ర్ రెండో స్థానంలో నిలిచాడు. విరాట్‌కోహ్లి (279 ర‌న్స్‌), కేఎల్ రాహుల్ (262 ర‌న్స్‌)తో మూడు, నాలుగో స్థానాల్లో కొన‌సాగుతోన్నారు.

ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్ లిస్ట్‌
ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్ లిస్ట్‌

అర్ష‌దీప్ సింగ్ టాప్‌

ముంబైతో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల‌తో అద‌ర‌గొట్టిన పంజాబ్ పేస‌ర్ అర్ష‌దీప్ సింగ్ ప‌ర్పుల్ క్యాప్‌లో టాప్ ప్లేస్‌లోకి దూసుకువ‌చ్చాడు. ఏడు మ్యాచుల్లో 13 వికెట్ల‌తో నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో సిరాజ్ (12 వికెట్లు), మూడో స్థానంలో ర‌షీద్ ఖాన్ (12 వికెట్లు)కొన‌సాగుతోన్నారు.

WhatsApp channel