Gavaskar on Rohit: అంత అనుభవం ఉండి ఏం లాభం.. రోహిత్ కెప్టెన్సీ దారుణంగా ఉంది: గవాస్కర్-gavaskar on rohit says he is disappointed ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gavaskar On Rohit: అంత అనుభవం ఉండి ఏం లాభం.. రోహిత్ కెప్టెన్సీ దారుణంగా ఉంది: గవాస్కర్

Gavaskar on Rohit: అంత అనుభవం ఉండి ఏం లాభం.. రోహిత్ కెప్టెన్సీ దారుణంగా ఉంది: గవాస్కర్

Hari Prasad S HT Telugu
Apr 17, 2024 05:08 PM IST

Gavaskar on Rohit: అంత అనుభవం ఉండి ఏం లాభం.. రోహిత్ కెప్టెన్సీ దారుణంగా ఉంది అంటూ సునీల్ గవాస్కర్ అనడం గమనార్హం. రోహిత్ కెప్టెన్సీపై అతడు తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.

రోహిత్ శర్మ కెప్టెన్సీపై గవాస్కర్ మండిపాటు
రోహిత్ శర్మ కెప్టెన్సీపై గవాస్కర్ మండిపాటు (Getty Images)

Gavaskar on Rohit: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతని కెప్టెన్సీ దారుణంగా ఉందని అన్నాడు. ఐపీఎల్లో అంత అనుభవం ఉన్నా కూడా కనీసం టీ20 ఫార్మాట్లోనూ ఫైనల్స్ చేరలేకపోవడం తనకు నిరాశ కలిగించిందని స్పష్టం చేశాడు. కోహ్లి, రవిశాస్త్రి హయాం గురించి చెబుతూ సన్నీ చేసిన కామెంట్స్ రోహిత్ కు అస్సలు మింగుడు పడదనే చెప్పాలి.

రోహిత్ 18 నెలల కిందట టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్ అయ్యాడు. మొదట్లో వరుసగా కొన్ని ద్వైపాక్షిక సిరీస్ లలో విజయాలు సాధించినా ఏషియా కప్, టీ20 వరల్డ్ కప్ లతోపాటు విదేశాల్లో వైఫల్యాలు కొనసాగాయి. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లలో కనీసం ఫైనల్స్ కూడా చేరలేదు. పదేళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ఐసీసీ ట్రోఫీని సాధించి పెట్టడంలోనూ రోహిత్ రెండుసార్లు విఫలమయ్యాడు. దీంతో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అతని కెప్టెన్సీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

విదేశీ టెస్టు సిరీస్ లలో జట్టు ప్రదర్శన క్షీణించడాన్ని కూడా గవాస్కర్ లేవనెత్తాడు. నిజానికి కోహ్లి కెప్టెన్సీలో విదేశాల్లో ఇండియా మెరుగ్గా రాణించింది. ఆస్ట్రేలియాలో రెండుసార్లు సిరీస్ లు గెలిచింది. ఇంగ్లండ్ గడ్డపై 2-1 లీడ్ సాధించింది. రోహిత్ కెప్టెన్సీలో ఆ ప్రదర్శన కనిపించడం లేదు.

"రోహిత్ నుంచి నేను ఇంకాస్త ఎక్కువే అంచనా వేశాను. ఇండియా సంగతి వదిలేయండి. కానీ విదేశాల్లో గెలవడం నిజమైన పరీక్ష. అక్కడే అతడు కాస్త నిరాశ పరిచాడు. టీ20 ఫార్మాట్ లోనూ అంతే. ఐపీఎల్లో వందల మ్యాచ్ లు ఆడిన అనుభవం, జట్టులో బెస్ట్ ఐపీఎల్ ప్లేయర్స్ ఉన్నా కూడా కనీసం ఫైనల్స్ చేరుకోలేకపోవడం నిరాశ కలిగిస్తోంది" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు.

సోమవారం (జులై 10) తన 74వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ లిటిల్ మాస్టర్.. ఈ సందర్భంగా కోహ్లి, రవిశాస్త్రి హయాం గురించి కూడా గుర్తు చేయడం విశేషం. ఆ సమయంలో టీమిండియాలోని పేస్ బౌలర్లు 20 వికెట్లు తీసి టెస్టులు గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం మన బౌలర్లు చేసిన తప్పులను సన్నీ ఎత్తి చూపాడు.

"వాళ్లు తమను తాము ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. ఎందుకు మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాం? టాస్ సమయంలో ఆకాశం మేఘావృతమైనందుకు అలా చేశామని చెప్పొచ్చు. ఆ తర్వాత ప్రశ్న ఏంటంటే.. ట్రావిస్ హెడ్ షార్ట్ బాల్ కు ఇబ్బంది పడతాడని తెలియదా? అతడు 80 పరుగులు చేసిన తర్వాత గానీ బౌన్సర్లు వేయలేదు ఎందుకు? హెడ్ క్రీజులోకి రాగానే కామెంటరీ బాక్స్ లో ఉన్న రికీ పాంటింగ్ చెబుతూ ఉన్నాడు.. అతనికి బౌన్సర్లు వేయండి అని. అందరికీ తెలుసు కానీ ఎవరూ ప్రయత్నించలేదు" అని గవాస్కర్ అన్నాడు.

Whats_app_banner