HBD Sunil Gavaskar : ఎంత స్పీడ్ బాల్ అయినా భయమే లేదు.. నో హెల్మెట్.. ఓన్లీ దంచికొట్టుడే
HBD Sunil Gavaskar : సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడే చాలా మంది సచిన్‌ను ఔట్ చేస్తే టీవీ స్విచ్ ఆఫ్ చేస్తానని చెబుతుంటారు. అయితే సచిన్ అభిమానుల కంటే ముందే సునీల్ గవాస్కర్ ఫ్యాన్స్ ఇలానే చేసేవారు.
జులై 10న మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పుట్టినరోజు. 74 ఏళ్ల ఆయన.. ఇంకా క్రికెట్ అంటే ఎంతో ఇష్టంగానే ఉంటాడు. ఎన్నో గొప్ప గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. 1970, 80లలో చాలా మంది క్రికెట్ అభిమానులు సునీల్ గవాస్కర్ అవుట్ అయినప్పుడు రేడియోను ఆఫ్ చేసేవారు. ఇంగ్లండ్ క్రికెట్‌ను కనిపెట్టినప్పటికీ, 1970ల తర్వాత దానిని వెస్టిండీస్ పాలించింది.
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల ఎదుగుదల, వివియన్ రిచర్స్ అటాకింగ్ స్టైల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. వెస్టిండీస్ క్రికెట్ అభిమానులకు ఇది ఎప్పుడూ ఒక వేడుక. ఇప్పటికీ ఆ విషయాలను గుర్తుచేసుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వెస్టిండీస్ అభిమానులకు షాక్ ఇచ్చి.. తనవైపు తిరిగి చూసుకునేలా చేసిన ఘనత సునీల్ గవాస్కర్‌కు మాత్రమే ఉంది.
ఆ సమయంలో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల దూకుడు, బౌన్సర్, స్వింగ్, స్పీడును ఎదుర్కొనే వాళ్లు భారత జట్టులో లేరు. అప్పుడే సునీల్ గవాస్కర్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. సునీల్ గవాస్కర్ అరంగేట్రంతో వెస్టిండీస్ మ్యాచ్‌లో 65 పరుగులు చేశాడు. ఆ సిరీస్ లో భారీగా పరుగులు చేసి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేశాడు.
మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ప్రపంచం నివ్వెరపోయే వెస్టిండీస్ బౌలర్లపై సునీల్ గవాస్కర్ ఎప్పుడూ హెల్మెట్ వాడలేదు. ఇంటర్నెట్‌లో సునీల్ గవాస్కర్ హెల్మెట్ ధరించిన ఫోటోలు కనిపించవు. ఎందుకంటే సునీల్ గవాస్కర్ తన క్రికెట్ కెరీర్‌లో ఎప్పుడూ హెల్మెట్ ధరించలేదు.
నేటికీ, టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు చేయడం రికార్డ్‌గా పరిగణించబడుతుంది. అయితే గవాస్కర్ 1980లలో 10,122 పరుగులు చేశాడు. సునీల్ గవాస్కర్ గురించి పాకిస్థాన్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ చెప్పిన మాటలు ఇవి ఏంటంటే.. సునీల్ గవాస్కర్ లాగా సచిన్ ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు. సునీల్ గవాస్కర్‌ను చూసి సచిన్ క్రికెట్ ప్రారంభించాడు. ఆయనకు ఎవరూ సాటిలేరని చెప్పుకొచ్చాడు.