Dhoni Turns Guru: ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌కు ధోనీ క్లాస్‌ - స్టూడెంట్స్‌గా మారిన స‌న్‌రైజ‌ర్స్ ప్లేయ‌ర్స్ - వీడియో వైర‌ల్‌-dhoni turns guru for srh players video viral on social media ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Dhoni Turns Guru For Srh Players Video Viral On Social Media

Dhoni Turns Guru: ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌కు ధోనీ క్లాస్‌ - స్టూడెంట్స్‌గా మారిన స‌న్‌రైజ‌ర్స్ ప్లేయ‌ర్స్ - వీడియో వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 22, 2023 12:01 PM IST

Dhoni Turns Guru: ప్ర‌త్య‌ర్థి టీమ్‌ కోసం ధోనీ గురువుగా అవ‌తార‌మెత్తాడు. శుక్ర‌వారం స‌న్‌రైజ‌ర్స్ యంగ్ ప్లేయ‌ర్స్‌కు ధోనీ విలువైన స‌ల‌హాలిస్తూ క‌నిపించిన వీడియో సోష‌ల్ మీడియాలోవైర‌ల్‌గా మారింది.

ధోనీ
ధోనీ

Dhoni Turns Guru: త‌న ఆట‌తీరు, వ్య‌క్తిత్వంతో ప‌లు సంద‌ర్భాల్లో క్రికెట్ అభిమానుల మ‌న‌సుల్ని గెల‌చుకున్నాడు దిగ్గ‌జ క్రికెట‌ర్‌ ధోనీ. శుక్ర‌వారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మ‌రోసారి ధోనీ త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌పై చెన్నై ఏడు వికెట్ల తేడాతో విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంత‌రం స‌న్‌రైజ‌ర్స్ యంగ్ ప్లేయ‌ర్స్ అంద‌రూ ధోనీతో భేటీ అయ్యారు.

స్టేడియంలోనే వారికి ధోనీ ... క్రికెట్‌లో మెళ‌కువ‌ల‌ను చెబుతూ క‌నిపించాడు. ధోనీ చెబుతోన్న మాట‌ల‌ను శ్ర‌ద్ధ‌గా ఆల‌కిస్తూ స‌న్‌రైజ‌ర్స్ ప్లేయ‌ర్స్ క‌నిపించారు. ఈ వీడియోను చెన్నై సూప‌ర్ కింగ్స్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇయాన్ బిష‌న్‌తో పాటు ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు ధోనీ గొప్ప‌త‌నానికి నిద‌ర్శ‌న‌మిదంటూ కామెంట్స్ చేశారు.

ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల కోసం ధోనీ గురువుగా మారాడ‌ని ఓ నెటిజ‌న్ కామెంట్స్ చేశాడు. ఈ వీడియోలో ధోనీ గురువులా క‌నిపిస్తోండ‌గా స‌న్‌రైజ‌ర్స్ ప్లేయ‌ర్స్ అంతా స్టూడెంట్స్‌లో మారిపోయార‌ని మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు.

కాగా ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 134 ప‌రుగులు చేయ‌గా డేవాన్ కాన్వే హాఫ్ సెంచ‌రీతో రాణించ‌డంతో చెన్నై 18 ఓవ‌ర్ల‌లో టార్గెట్‌ను ఛేదించి విజ‌యాన్ని అందుకున్న‌ది. ఈ గెలుపుతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో చెన్నై మూడో స్థానానికి చేరుకున్న‌ది.

WhatsApp channel

టాపిక్