Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్‌ను కుక్క కరిచిందట-arjun tendulkar bitten by dog ahead of mi match against lsg ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్‌ను కుక్క కరిచిందట

Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్‌ను కుక్క కరిచిందట

Hari Prasad S HT Telugu
May 16, 2023 03:12 PM IST

Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్‌ను కుక్క కరిచిందట. ఈ విషయాన్ని అతడే వెల్లడించాడు. లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ తో అర్జున్ ఈ విషయం చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది.

తనకు కుక్క కరిచిందని చెబుతున్న అర్జున్ టెండూల్కర్
తనకు కుక్క కరిచిందని చెబుతున్న అర్జున్ టెండూల్కర్ (Screengrab)

Arjun Tendulkar: ముంబై ఇండియన్స్ ప్లేయర్ అర్జున్ టెండూల్కర్ ను కుక్క కరిచింది. ఈ విషయాన్ని అర్జునే చెప్పడం విశేషం. దీంతో మంగళవారం (మే 16) లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ కు అతడు దూరం కానున్నాడు. మూడేళ్ల తర్వాత తొలిసారి ఈ సీజన్ లోనే ముంబై తుది జట్టులో చోటు దక్కించుకున్న అర్జున్.. గత కొన్ని మ్యాచ్ లుగా బెంచ్ కే పరిమితమయ్యాడు.

చివరిసారి ఏప్రిల్ 25న అతడు ఎంఐ తరఫున ఆడాడు. అయితే లక్నోతో మ్యాచ్ కు తిరిగి జట్టులోకి వస్తాడని భావించినా.. ఇప్పుడిలా కుక్క కాటుకు గురవడంతో ఈ మ్యాచ్ కు కూడా దూరం కానున్నాడు. తనను కుక్క ఎప్పుడు, ఎలా కరిచిందన్నది తెలియదు లేదు కానీ.. తన ఎడమ చేతి వేళ్లకు కుక్క కాటు ఉన్నట్లు ఓ వీడియోలో అతడు లక్నో ప్లేయర్ తో చెప్పాడు.

లక్నో సూపర్ జెయింట్స్ షేర్ చేసిన వీడియోలో అర్జున్ ఈ విషయం వెల్లడించాడు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ తరఫున 4 మ్యాచ్ లు ఆడిన అర్జున్.. మూడు వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఛాన్స్ దక్కలేదు. లక్నోతో మ్యాచ్ లో ఆడే అవకాశాలు ఉన్నట్లు అనిపించినా.. ఇప్పుడీ ఘటనతో అర్జున్ ఆ ఛాన్స్ కోల్పోయాడు.

అయితే అర్జున్ ను కుక్క కరిచిందన్న వార్తపై సోషల్ మీడియాలో నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ఎన్నో మీమ్స్ తో అర్జున్ ను ఆట పట్టిస్తున్నారు. ముంబై జట్టులో ఆడలేకపోవడానికి ఇదో సాకు దొరికిందా అని ఓ యూజర్ కామెంట్ చేయడం విశేషం.

ఈ ఏడాది కేకేఆర్ తో మ్యాచ్ లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అర్జున్.. ఆ మ్యాచ్ లో రెండు ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చాడు. తరవాత సన్ రైజర్స్ తో మ్యాచ్ లో చివరి ఓవర్లో 21 పరుగులను కాపాడటంతోపాటు అదే మ్యాచ్ లో తన వికెట్ల బోణీ చేశాడు. ఇక గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో తొలిసారి బ్యాటింగ్ చేసే అవకాశం రాగా.. అతడో సిక్స్ బాదాడు.

సంబంధిత కథనం