India vs South Africa Toss: టాస్ గెలిచిన భారత్.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్
India vs South Africa: ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా ఆశిస్తోంది. మరోపక్క పరువు కోసం సఫారీ జట్టు ఎదురుచూస్తోంది.
India vs South Africa 3rd T20I: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండింటిని నెగ్గి.. సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన.. నామమాత్రపు మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని తహతహ లాడుతోంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా ఓటమిని చవిచూసిన ప్రొటీస్ జట్టు.. ఇందులో గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది.
ఇప్పటికే సిరీస్ సొంతం కావడంతో నామమాత్రమైన ఈ మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్లకు టీమిండియా విశ్రాంతినిచ్చింది. ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌కు రెస్ట్ ఇచ్చింది. విరాట్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోనుంది. బుమ్రా ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో సిరాజ్‌ను తీసుకున్నారు. అంతేకాకుండా బౌలింగ్ పటిష్ఠంగా ఉండేందుకు ఈ మ్యాచ్‌లో ప్రయోగాలు చేయనుంది రోహిత్ సేన.
టీ20 ప్రపంచకప్ ముందు ఉన్న అన్నీ ఆప్షన్లను చెక్ చేసుకుని జట్టును పటిష్ఠం చేయాలని భారత్ భావిస్తోంది. ముఖ్యంగా బౌలర్లకు ఈ మ్యాచ్‌కు పరీక్షే. ఎందుకంటే గత మ్యాచ్‌లో 237 పరుగుల భారీ స్కోరును కూడా కాపాడుకునేందుకు బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కొత్త బంతులతో అర్ష్‌దీప్ బాగానే రాణిస్తున్నా.. ఆదివారం మ్యాచ్‌లో అతడు లయ తప్పాడు. కాబట్టి ఈ మ్యాచ్‌లో అతడు తిరిగి పుంజుకోవాలని చూస్తున్నాడు.
మరోపక్క ఇప్పటికే సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా ఇందులో గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విజృంభించిన సఫారీ బ్యాటర్లు.. మరో సారి బ్యాట్ ఝుళిపించాలని చూస్తున్నారు. అయితే కెప్టెన్ బవుమా పేలవ ఫామ్ సౌతాఫ్రికాకు ఆందోళన కలిగిస్తోంది. ఈ సిరీస్‌లో అతడు ఒక్క పరుగులు చేయలేదు. బౌలింగ్‌లోనూ సఫారీ పేసర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆకట్టుకోలేదు.
తుది జట్లు..
భారత్..
రోహిత్ శర్మ(కెప్టెన్), రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్,రవించంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్/ఉమేశ్ యాదవ్.
దక్షిణాఫ్రికా..
క్వింటన్ డికాక్, టెంబా బవుమా(కెప్టెన్), రీజా హెండ్రింక్స్/హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్కక్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, ఎన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి
సంబంధిత కథనం