Gill On Rohit Sharma : రోహిత్ శర్మతో బ్యాటింగ్ చేసేప్పుడు చాలా నేర్చుకున్నాను
Shubman Gill On Rohit Sharma : భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో దూసుకెళ్తున్నాడు. తగ్గేదేలే అంటూ.. బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే అతడు కెప్టెన్ రోహిత్ శర్మతో బ్యాటింగ్ చేస్తూ చాలా నేర్చుకున్నాని చెప్పుకొచ్చాడు.
క్రికెట్‌లో తన సత్తాను చాటుకుంటూ కొన్ని రోజులుగా శుభ్‌మన్ గిల్(Shubman Gill) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి ODIలో 149 బంతుల్లో 208 పరుగులు చేసి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించి.. తక్కువ వయసులో రికార్డు నమోదు చేశాడు. రెండో వన్డేలోనూ 40 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
రోహిత్ శర్మ(Rohit Sharma)తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తాను చాలా నేర్చుకున్నానని గిల్ చెప్పాడు. రాయ్‌పూర్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్‌లో ఈ ఆటగాడు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం సులభతరంగా మారిందని తెలిపాడు.
'రోహిత్ భాయ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ కల. అతనితో పాటు బ్యాటింగ్ నేర్చుకున్నాను. చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను, ఇషాన్ కిషన్(Ishan Kishan) మంచి ఫ్రెండ్స్. బయట కూడా కలిసి చాలా సమయం గడుపుతాం.' అని గిల్ అన్నాడు. రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో గిల్ 40 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచాడు గిల్.
న్యూజిలాండ్ తో రెండో వన్డేలో భారత్ విజయం సాధించడంతో సిరీస్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ విధించిన 108 పరుగుల టార్గెట్‌ను టీమ్ ఇండియా(Team India) ఇరవై ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ బ్యాట్ ఝులిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 49 బాల్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి(Virat Kohli) 11 పరుగులకే ఔటైనా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ కలిసి ఇండియాకు విజయాన్ని అందించారు.
శుభమ్‌న్ గిల్ 40 రన్స్, ఇషాన్ కిషన్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో 108 రన్స్‌కు ఆలౌటైంది. షమీ, హార్దిక్ పాండ్య, సుందర్ బాల్‌తో విజృంభించడంతో న్యూజిలాండ్ వంద పరుగుల్ని కష్టంగా దాటింది.
గ్లెన్ ఫిలిప్స్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో టీమ్ ఇండియా కైవసం చేసుకుంది.