India Tour of Bangladesh: బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన.. షెడ్యూల్‌ ఇదే-india tour of bangladesh will have 2 tests and 3 odis ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Tour Of Bangladesh: బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

India Tour of Bangladesh: బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

Hari Prasad S HT Telugu
Oct 20, 2022 03:56 PM IST

India Tour of Bangladesh: బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటించనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం (అక్టోబర్‌ 20) బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) రిలీజ్‌ చేసింది.

<p>ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్ లో పర్యటించనున్న ఇండియన్ టీమ్</p>
ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్ లో పర్యటించనున్న ఇండియన్ టీమ్

India Tour of Bangladesh: టీ20 వరల్డ్‌ కప్‌ ముగిసిన కొద్ది రోజులకే బంగ్లాదేశ్‌ టూర్‌కు వెళ్లనుంది టీమిండియా. డిసెంబర్‌లో ఈ టూర్‌ ఉంటుందని బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు (బీసీబీ) గురువారం (అక్టోబర్‌ 20) వెల్లడించింది. మొత్తం మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌కు ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ వెళ్లనుంది.

2015 తర్వాత ఆ దేశ పర్యటనకు మన టీమ్‌ వెళ్లడం ఇదే తొలిసారి. డిసెంబర్‌ 4న ఈ టూర్‌ మొదలవుతుంది. ఢాకాలోని మిర్పూర్‌ స్టేడియంలో డిసెంబర్‌ 4, 7, 10 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. ఇక డిసెంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 18 వరకు చట్టోగ్రామ్‌లో తొలి టెస్ట్‌ జరుగుతుంది. ఇక రెండో టెస్ట్‌ డిసెంబర్‌ 22 నుంచి 26 వరకూ మళ్లీ ఢాకాలోనే జరగనుంది.

ఈ షెడ్యూల్‌ను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ప్రెసిడెంట్‌ నజ్ముల్‌ హసన్‌ ఒక ప్రకటనలో రిలీజ్‌ చేశారు. "ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్‌, ఇండియా మ్యాచ్‌లు కొన్ని గొప్పగా సాగాయి. దీంతో మరో సిరీస్‌లో ఈ రెండు దేశాలు తలపడితే చూడాలని ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు" అని హసన్‌ అన్నారు. ఈ షెడ్యూల్‌ను ఖరారు చేయడంలో సహకరించిన బీసీసీఐకి కృతజ్ఞతలు చెప్పారు.

ఇండియన్‌ టీమ్‌ను స్వాగతించడానికి ఎదురుచూస్తుంటామని అన్నారు. బంగ్లాదేశ్‌తో ఇండియా ఆడబోయే రెండు టెస్ట్‌ల సిరీస్‌కు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్లు కూడా ఉంటాయి. గతేడాది రన్నరప్‌గా నిలిచిన ఇండియన్‌ టీమ్‌.. ఈసారి టేబుల్లో నాలుగోస్థానంలో ఉంది. 2015లో చివరిసారి బంగ్లాదేశ్‌ టూర్‌కు వెళ్లినప్పుడు ఇండియా వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోగా.. ఒక టెస్ట్‌ డ్రాగా ముగిసింది.

ఇండియా, బంగ్లాదేశ్‌ సిరీస్‌కు చాలా ప్రాముఖ్యత ఉన్నదని బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా అన్నారు. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ రెండు టెస్ట్‌ల సిరీస్‌ జరగనుండటంతో రెండు టీమ్స్‌ తీవ్రంగా పోటీ పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Whats_app_banner