Sridharan Sriram: ఆసియాకప్, వరల్డ్‌కప్‌కు బంగ్లాదేశ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్
Sridharan Sriram: బంగ్లాదేశ్ టీమ్ తమ హెడ్ కోచ్‌గా ఓ ఇండియన్ మాజీ ప్లేయర్‌ను నియమించడం విశేషం. రానున్న ఆసియాకప్‌తోపాటు వరల్డ్‌కప్ వరకూ అతడే కోచ్‌గా కొనసాగనున్నాడు.
ఢాకా: బంగ్లాదేశ్ టీమ్‌కు కొత్త కోచ్ వచ్చాడు. ఇండియన్ టీమ్ మాజీ ఆల్‌రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను తమ హెడ్ కోచ్‌గా బంగ్లాదేశ్ నియమించినట్లు అక్కడి క్రికెట్ బోర్డు డైరెక్టర్ వెల్లడించారు. అక్కడి డైలీ స్టార్ రిపోర్ట్ ప్రకారం.. శ్రీరామ్ రానున్న ఆసియాకప్‌తోపాటు టీ20 వరల్డ్‌కప్ వరకూ బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌గా ఉంటాడు. వరల్డ్‌కప్ వరకూ శ్రీరామ్‌నే కోచ్‌గా నియమించినట్లు బోర్డు డైరెక్టర్ వెల్లడించారని డైలీ స్టార్ తెలిపింది.
"తాజా మైండ్‌సెట్‌తో ముందుకెళ్లాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఆసియాకప్ నుంచి కొత్త కోచ్ వస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్ మా లక్ష్యం కావడంతో అతన్ని ఆసియాకప్‌లోనే నియమించకపోతే తగినంత సమయం ఉండదు" అని బోర్డు డైరెక్టర్ అన్నారు. శ్రీధరన్ శ్రీరామ్ ఇండియా తరఫున 2000 నుంచి 2004 వరకూ ఆడాడు.
అయితే అదే సమయంలో ప్రస్తుతం కోచ్‌గా ఉన్న సౌతాఫ్రికన్ రసెల్ డొమింగో టెస్ట్ టీమ్‌కు కొనసాగనున్నాడు. నవంబర్‌లో ఇండియాతో బంగ్లాదేశ్ ఓ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. దీంతో అప్పటి వరకూ డొమింగోను టెస్ట్ టీమ్ కోచ్‌గా కొనసాగిస్తున్నట్లు కూడా బోర్డు డైరెక్టర్ చెప్పారు.
ఆ తర్వాత ఆస్ట్రేలియా టీమ్‌కు చాలా కాలంపాటు స్పిన్‌బౌలింగ్, అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు. ఆస్ట్రేలియా కోచ్‌గా డారెన్ లీమన్ ఉన్న సమయంలో శ్రీరామ్‌కు స్పిన్ బౌలింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆర్సీబీ టీమ్ సపోర్ట్ స్టాఫ్‌లో శ్రీరామ్ ఉన్నాడు. దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడానికి ఈ మధ్యే ఆస్ట్రేలియా స్పిన్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు.