MIW vs GGW 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో తొలి అర్ధశతకం.. చెలరేగిన హర్మన్ ప్రీత్ కౌర్
MIW vs GGW 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆరంభ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. గుజరాత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ అర్ధశతకంతో చెలరేగింది.
MIW vs GGW 2023: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ఆరంభ సీజన్ తొలి మ్యాచ్‌లోనే భారీ స్కోరు నమోదైంది. గుజరాత్ జెయింట్స్‌తో తలపడుతున్న ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ ప్రీత్ కౌర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్(65) అద్భుత అర్ధశతకంతో విజృంభించగా.. మ్యాథ్యూస్(47), అమిలియా(45*) రాణించారు. ఫలితంగా ముంబయి జట్టు అదిరిపోయే స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. ఆష్లే గార్డనర్, తనూజ, జార్జియా తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
చెలరేగిన హర్మన్..
ముంబయి ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ 47 పరుగులతో ముంబయికి శుభారంభాన్నిచ్చింది. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన మ్యాథ్యూస్.. జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. మరో ఓపెనర్ యస్తికా భాటియా నిరాశ పరిచినా నిలకడగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచింది. అనంతరం నాట్ సీవర్‌తో(23) కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించింది. 10 ఓవర్లోల గార్డనర్ బౌలింగ్‌లో హాఫ్ సెంచరీకి దగ్గరగా వచ్చి పెవిలియన్ చేరింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 26 బంతుల్లోనే 60 పరుగులు చేసి మహిళల ప్రీమియర్ లీగులో తొలి అర్ధశతకాన్ని నమోదు చేసింది. ఇందులో 14 ఫోర్లు ఉన్నాయి.